బిజినెస్

పరిశ్రమలకు భూ కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: నవ్యాంధ్రలోని పారిశ్రామిక అవసరాలకు భూములను కేటాయిస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను, మరో 10 గ్రామాల్లో 7,214.87 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం ఏపిఐఐసికి కనీస ధరకు కేటాయించాలని నిర్ణయంచారు. అలాగే విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం అందాలపల్లి గ్రామంలో 0.94 ఎకరాల స్థలాన్ని ఎకరా 12 లక్షల రూపాయలకు పర్యాటక శాఖకు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే మండలం దుప్పిటూరు గ్రామంలో 61.63 ఎకరాల భూమిని సెజ్ విస్తరణ కోసం ఎకరా 12 లక్షల రూపాయల చొప్పన ఏపిఐఐసికి కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా పరదేశిపాలెం గ్రామంలో 1.90 ఎకరాల భూమిని 133 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు నిమిత్తం ఏపి ట్రాన్స్‌కోకు అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది.
పేర్లలో మార్పులు
ఏపి బిసి కమిషన్ సిఫార్సుల మేరకు వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న వడ్డె, వడ్డీలు, వద్దె, వడ్డెలు అనే పదాలకు పర్యాయ పదాలుగా వడ్డె, వడ్డబోని, వడ్డియరాజ్, వడ్డెర అనే పదాలను చేర్చడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నాబార్డ్ ద్వారా స్థాపించిన కంపెనీ-అగ్రి బిజినెస్ లిమిటెడ్‌కు మూల ధన నిధిని సమకూర్చే అంశానికి కూడా మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం 1.16 కోట్ల రూపాయల అదనపు నిధిని సమకూర్చడానికి మంత్రి మండలి ఆమోదించింది.