బిజినెస్

భారీగా పెరగనున్న టెలికం ఇన్‌ఫ్రా ఆదాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారతీయ టెలికం వౌలిక సదుపాయాల రంగం ఆదాయం 2023 నాటికి రూ. 21,500 కోట్ల నుంచి రూ. 31,000 కోట్ల వరకు చేరే అ వకాశాలున్నాయి. తాజా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి పరిణామాలు కొత్త బిజినెస్ మోడళ్లకు డిమాండ్‌ను పెంచుతుండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంద ని శుక్రవారం సాయంత్రం వెలువడిన ఈవై అధ్యయ నం తెలిపింది. అయితే, ఈ స్థాయిలో ఆదాయాలను ఆర్జించే క్రమంలో ఈ రంగంలో రూ. 66,000 కోట్ల నుంచి రూ. 93,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉందని పేర్కొంది. కొత్త అవకాశాలను చేజిక్కించుకునేందుకు టవర్‌కోలు నేడు మంచి స్థానం లో ఉన్నాయి. ఈ కొత్త అవకాశాల ద్వారా 2023 నాటికి రూ. 215 బిలియన్ల నుంచి రూ. 310 బిలియన్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఈవై ఎమర్జింగ్ మా ర్కెట్స్ టీఎంటీ లీడర్ ప్రశాంత్ సింఘాల్ తెలిపారు.