బిజినెస్

22న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు పలు రాజకీయ, ప్రజా, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బ్యాంకుల విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలతో సంప్రదించి నవంబర్ రెండో వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రా బ్యాంక్ పరిరక్షణ సమితి కన్వీనర్, ఏఐటీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఓబులేసు అధ్యక్షతన శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా కేంద్రంపై వత్తిడి పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పీ అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత సీఎం జగన్‌తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంపై వత్తిడి పెంచితే ఉపయోగం ఉంటుందన్నారు. వైఎస్సార్‌టీయూ రాష్ట్ర నేత పీ గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రపై కేంద్రం చిన్నచూపు చూస్తోందనడానికి ఆంధ్రాబ్యాంక్ విలీనం ఉదాహరణగా నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ పెద్ద బ్యాంకులు వస్తే సామాన్య ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలకు బ్యాంక్ సేవలు దూరం కావడం ఖాయమన్నారు. ఏఐటీయుసి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంకట రామారావు, ఓబులేసు, బ్యాంక్ ఎంప్లారుూస్ కోఆర్డినేషన్ కమిటీ నేత వైఎస్ రావు, ఏఐబీఈఏ నేతలు కొండలరావు, ఐఎఫ్‌టీయు నేత పోలారి, బీకేఎంయూ నేత వెంకటేశ్వర్లు, ఏఐటీయుసీ నేత రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.