బిజినెస్

కొనసాగనున్న లాభాల ట్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఈవారం వెలువడనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలతోబాటు, అంతర్జాతీయ వాణిజ్య రంగ తీరు మన దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయంటున్నారు విశే్లషకులు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, ఇప్పటి వరకు వెలువడిన కంపెనీల సంతృప్తికర ఫలితాల కారణంగా మార్కెట్లు ప్రస్తుత లాభదాయక ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలున్నాయంటున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లలో కూడా వాటాల కొనుగోళ్ల ఆసక్తి నెలకొందని ప్రముఖ విశే్లషకుడు సిద్ధార్థ కెమ్కా పేర్కొన్నారు. అలాగే బ్రిటన్-ఐరోపా సమాఖ్య మధ్య బ్రెగ్జిట్‌పై సాగుతున్న చర్చలు కూడా సానుకూల ముగింపునకు చేరాయి. ఈక్రమంలో ఈ సానుకూల అంశాలు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తాలూకు ప్రతికూలతలను సైతం అధిగమించేందుకు దోహదం చేస్తాయని ఆయన విశే్లషించారు. ఇక దేశీయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గత వారం ‘మరిన్ని ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపడతామ’ని చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవడం ద్వారా వార్షిక బడ్జెట్‌లోటును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లకు మనదేశంలో పెట్టుబడులకు మళ్లేలా చేసిందంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా స్టాక్‌మార్కెట్లకు సోమవారం సెలవు. ఈక్రమంలో మంగళవారం నాడు ప్రధానంగా గత శుక్రవారం వాణిజ్య సమయం ముగిసిన అనంతరం వెలువడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) త్రైమాసిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉంటుందంటున్నారు. ఆర్‌ఐఎల్ 18.6 శాతం అధికంగా రూ. 11,262 కోట్ల భారీ లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈవారం యాక్సిస్, కోటక్ బ్యాంకులు, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హీరోమోటోకార్ప్, మారుతీ, మారికో, ఎస్‌బీఐ సైతం ఫలితాలు వెలువరించనున్న క్రమంలో లాభాల్లో ఉన్నప్పటికీ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని మరో విశే్లషకుడు ముస్త్ఫా నదీమ్ తెలిపారు. గతవారం సెనె్సక్స్ 1,171.30 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే.