బిజినెస్

వ్యవధిలోగా రుణాలు చెల్లించేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: తమకున్న అప్పులన్నింటినీ కాల వ్యవధిలోగా తీర్చేస్తామని వొడాఫోన్ ఐడియా సంయుక్త సంస్థ బుధవారం నాడిక్కడ తెలిపింది. తమ సంస్థ ఇప్పటి వరకు రుణ భారాన్ని తగ్గించాలని కానీ, రుణాల చెల్లింపునకు కాల వ్యవధులను పొడిగించాలని కానీ ఏ బ్యాంకునూ కోరలేదని స్పష్టం చేసింది. తమ సంస్థ రూ. 40 వేల కోట్ల రుణ భారం అధికం కావడంతో ఆ రుణాలపై పునరాలోచించాలని బ్యాంకులపై వత్తిడి తెస్తోందని కొన్ని ఊహాగానాలు వెలువడ్డాయని, అవి ముమ్మాటికీ సత్య దూరమని, నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. కొంతమంది విశే్లషకులు ఇటీవలి సుప్రీం కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ టెలికాం ఆదాయాలకు కొత్త అర్థం వచ్చిందని, ఈక్రమంలో వొడాఫోన్ ఐడియా వంటి పాత టెలికాం ఆపరేటర్లకు పరిస్థితులు ప్రతికూలంగా మారాయని విశే్లషకులు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా అప్పులు తీర్చేలా పద్దులను సవరించుకోవాల్సిన అవసరం నెలకొందని తెలిపారు. ఒక వేళ రుణ భారం తగ్గించే దిశగాప్రభుత్వం సహాయక చర్యలు చేపడితే అది ప్రస్తుతం ఉన్న కొన్ని జరిమానాలను, లైసెన్స్ ఫీజులను, సెక్ట్రం రుణాలపై రెండేళ్ల మారిటోరియంను తొలగించవచ్చని ఆ కధనాలు ఊహించాయి. ఇవే జరిగితే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)కు మంచి లబ్ధిచేకూరుతుందని తెలిపాయి. ఇప్పటికీ ఈ కంపెనీకి భవిష్యత్తులో అదనపువాటాలు సమకూర్చుకోవాల్సిన అగత్యం ఉందని తెలిపాయి. ప్రధానంగా ‘జఫ్రీస్’ సంస్థ గత వారం వెలువరించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. దీనిపై స్పందించిన ఆ సంయుక్త టెలికాం సంస్థ అధికార ప్రతినిధి బుధవా రం నాడిక్కడ మాట్లాడుతూ తమ సంస్థ ఎలాంటి రుణ పునస్సమీక్ష నిమిత్తంకానీ, రాయితీల కోసం కానీ ఏ బ్యాంకుకూ విజ్ఞప్తులు చేయలేదని స్పష్టం చేశారు. రుణాల ను ఆయా కాల వ్యవధుల్లోగా యథావిథిగా తిరిగి చెల్లిస్తామని తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో కంపెనీ వాటాలకు ఇబ్బందులు ఏర్పడుతున్న విషయా న్ని ఆయన దృష్టికి తేగా దీనిపై ప్రభుత్వ ఉపశమనాన్ని అర్థిస్తామన్నారు. ప్రధానంగా వడ్డీలను, జరిమానాలను రద్దు చేయాలని కోరుతామని స్పష్టం చేశారు.