బిజినెస్

40వేల మార్కు దాటిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల పరుగును కొనసాగించాయి. కార్పొరేట్ కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు, ఈక్విటీల్లో మదుపుచేసే వారికి ఆదాయ పన్ను తగ్గింపు ఉండవచ్చన్న అంచనాల క్రమంలో పెట్టుబడిదారుల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో బుధవారం సైతం సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఈ ఏడాది జూన్ 4 తర్వాత మళ్లీ 40వేల మార్కును దాటింది. తొలుత 40,178.12 పాయింట్లకు ఎగబాకిన ఈ సూచీ చివరిగా 220.03 పాయింట్ల ఆధిక్యతతో 0.55 శాతం లాభపడి 40,051.87 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అదేవిధంగా బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 57.25 పాయింట్లు (0.49 శాతం) లాభపడి 11,844.10 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ని రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) వంటి పన్నులను సైతం సరళతరం చేసే విషయంపై సమీక్షిస్తోందన్న కథనాలు వెలువడిన తర్వాత ఈక్విటీ మార్కెట్ సెంటిమెంటుకు మరింత బలం చేకూరిందని బ్రోకర్లు చెబుతున్నారు. బ్లూచిప్స్ ద్వారా మంచి ఆదాయాల రాబడి, కార్పొరేట్ పన్ను కోత ద్వారా అర్థవంతమైన లాభాలు చేకూరడం సైతం మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్‌బీఐ, టీసీఎస్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, సన్‌పార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో అత్యధికంగా 3.37 శాతం లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ 2.41 శాతం నష్టపోయాయి. అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల క్రమంలో ఓవైపు అంతర్జాతీయంగా మార్కెట్ల పరిస్థితి బలహీనంగా ఉన్నా ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి చర్యలు మార్కెట్లకు ఇంధనంలా మారాయని విశే్లషకులు తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో ఐటీ, టెక్, చమురు, సహజ వాయువులు, ఎఫ్‌ఎంసీజీ, కేపిటల్ గూడ్స్, వినిమయాలు, టెలికాం, ఇంధన సూచీలు 1.47 శాతం లాభపడ్డాయి. ఇలావుండగా వినిమయ వస్తువులు, స్థిరాస్తి, లోహ, వాహన సూచీలు 0.98 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.65 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపర్లు రాబోయే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ నిర్ణయం కోసం వేచిచూసే ధోరణిని అవలంభించారు. ఈక్రమంలో ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య సాగుతున్న చర్చలు కొలిక్కి రావడంలో కొంత ఆలస్యం చోటుచేసుకోవచ్చన్న అంచనాలు సైతం అంతర్జాతీయ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. కాగా ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా (ఆరు పైసలు) నష్టపోయి ఇంట్రాడేలో 70.91గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.54 శాతం తగ్గి బ్యారెల్ 61.26 డాలర్లు వంతున ట్రేడ్రైంది.