బిజినెస్

ఇక ‘టార్గెట్ గోల్డ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఇంతకాలం నల్లధనం వెలికితీతపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు అక్రమంగా నిల్వ ఉంచిన బంగారంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. నల్ల ధనంతో కొనుగోలు చేసిన బంగారాన్ని వెలికితీసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది. దాదాపు ముప్ఫై శాతం పన్ను చెల్లించడం ద్వారా ఈ బంగారాన్ని తెల్ల బంగారంగా మార్చుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ముప్ఫై శాతం పన్నుతోపాటు మూడు శాతం విద్యాసెస్సును కూడా వసూలు చేయవచ్చునని ఆదాయం పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న బంగారాన్ని ప్రకటించే వారికి క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మోదీ ప్రభుత్వం గతంలో కూడా ఇలా అక్రమంగా బంగారం నిల్వ ఉంచినవారికి క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించినా అది అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో జనం తమ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన బంగారాన్ని బయట పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పడొక అకర్షణీయమైన పథకం ద్వారా బీరువాలు, బ్యాంకు లాకర్లలో మూలుగుతున్న బంగారాన్ని వెలికితీయాలని యోచిస్తోంది. అక్రమంగా నిల్వ ఉంచిన బంగారం వివరాలు వెల్లడించే వారికి కొంత క్షమాభిక్ష సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వం ఈ అక్రమ నిల్వల బంగారంపై క్షమాభిక్ష పథకాన్ని కొంతకాలం అమలు చేసిన అనంతరం బంగారాన్ని అక్రమంగా నిల్వ చేసే వారిపై దాడులు ఉధృతం చేయాలని ఆలోచిస్తోంది. తమ వద్ద ఉన్న బంగారాన్ని ప్రకటించే వారికి కొంత పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నిల్వ ఉంచిన బంగారం వివరాలను బహిర్గతం చేసే వారికి ఒక నిర్దిష్ట కాలం వరకు కొంత పన్ను మినహాయింపు ఇస్తారని అంటున్నారు. వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపార సంస్థలు తమ వద్ద ఎంత బంగారాన్ని అధికారికంగా నిల్వ చేసుకోవచ్చుననేది ప్రభుత్వం నిర్ణయించి ఇంతకుమించి ఉండే బంగారం గురించి ఆదాయం పన్ను శాఖకు తెలియజేయవలసి ఉంటుంది. నిర్ణీత గడువులోగా తమ వద్ద ఉన్న అదనపు బంగారం నిల్వ గురించి తెలియజేసే వారికి కొంత పన్ను మినహాయింపు ఇస్తారని అంటున్నారు. బంగారం నిల్వల నిర్ణీత పరిమతి ఏమిటి? ఏ మేరకు పన్ను
మినహాయింపు ఇస్తారనే అనేది మాత్రం స్పష్టం కావటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఆదాయం పన్ను శాఖ అధికారులు ఈ రెండు అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని, ఒక నిర్ణయానికి వచ్చిన అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు పెడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ప్రజల వద్ద, ప్రైవేట్ సంస్థల వద్ద టన్నులకొద్దీ బంగారం ఉన్నందని, వీరంతా నల్లధనాన్ని బంగారంగా మార్చుకుని దాచుకున్నారన్నది ఆదాయ పన్ను శాఖ అధికారుల అంచనా. నిర్ణీత గడువు ముగిసిన అనంతరం వెలుగులోకి వచ్చే బంగారంపై పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశాలున్నాయి. రశీదు లేని బంగారాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన బంగారంగా ముద్ర వేయనున్నట్లు తెలిసింది. బంగారాన్ని రశీదు ఇవ్వకుండా విక్రయించడం, రశీదు తీసుకోకుండా బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని కూడా నిషేధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.