బిజినెస్

చివరి రోజూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 1: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాల బాటలో నడిచాయి. ఈవారం లావాదేవీలకు చివరి రోజున శుక్రవారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో నిఫ్టీ 35.98 పాయింట్లు (0.09 శాతం) పెరిగి, 40,165.03 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 13.15 పాయింట్లు (0.11 శాతం) మెరుగుపడి, 11,890.60 పాయింట్లుగా నమోదైంది. ఒకానొక దశలో, సెనె్సక్స్ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి వెళ్లింది. కానీ, ఆతర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ 3న సెనె్సక్స్ 40,267.62 పాయింట్లకు చేరింది. బీఎస్‌ఈలో ఇంత వరకూ అదే రికార్డు. గత రెండు రోజులుగా ఈ రికార్డును అధిగమించే స్థాయిలో సెనె్సక్స్ దూకుడుగా దూసుకెళ్లినప్పటికీ, ఆతర్వాత వేగం మందగించింది. శుక్రవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలోనూ మరోసారి అదే పరిస్థితి కనిపించినప్పటికీ, చివరికి, రికార్డుకు సుమారు 100 పాయింట్ల దిగువున ముగిసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, టెక్ మహీంద్ర, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు సగటున 5.18 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. ఎస్ బ్యాంక్ షేర్లు ఏకంగా 5.46 శాతం నష్టాలను చవిచూశాయి. ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసిక ఫలితాలు ఇంకా వెలువడక ముందే, ఈ కంపెనీ ఇంతలా నష్టాలను చవిచూడడం గమనార్హం. టీసీఎస్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ కంపెనీల వాటాలు సగటున 3 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. గత రెండు వారాలుగా మార్కెట్లో ఉన్న ధోరణులే బీఎస్‌ఈకి లాభాలను సంపాదించిపెట్టాయి. మదుపరుల సెంటిమెంట్ కూడా సానుకూలంగా ఉండడం కూడా మార్కెట్ దూకుడుకు మరో కారణం. అయితే, సెప్టెంబర్ మాసంలో వౌలిక సదుపాయాల కల్పనా రంగంలోని కంపెనీల వాటాల విలువ సగటున 5.2 శాతం పతనమైంది. అదే ఒరవడి అక్టోబర్ మాసంలోనూ పలు సందర్భాల్లో కనిపించింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యల్పం. ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఉత్పాదక రంగం గత నెల కూడా బలహీనంగా కొనసాగింది. గత రెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పతనమైంది. అయితే, ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు గత నెల రెండో వారం నుంచి క్రమంగా మెరుగుపడ్డాయి. చివరి వారంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతిరేక పరిస్థితులను అధిగమించి, లాభాల్లో నడిచాయి. ఇటు బీఎస్‌ఈలో, అటు ఎన్‌ఎస్‌ఈలో ఈవారం మొదటి నుంచి చివరి వరకూ లాభాలే నమోదుకావడం గమనార్హం. దాదాపుగా ప్రతిరోజూ, ఏదో ఒక సమయంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి సెనె్సక్స్ పాయింట్లు చేరుకోవడం, ఆతర్వాత పతనమైనప్పటికీ, స్వల్ప లాభాలతో ముగించడం రోజువారీ కార్యక్రమమైంది. శుక్రవారం లావాదేవీల్లో ఇండిస్‌ఇండ్ బ్యాంక్ 5.18 శాతం (1,379.45 పాయింట్లు) లాభపడగా, టాటా స్టీల్ 5.09 శాతం (399.85 పాయింట్లు) మెరుగుపడింది. అదే విధంగా వేదాంత 3.10 శాతం (152.90 పాయింట్లు), టెక్ మహీంద్ర 2.94 శాతం (760 పాయింట్లు), ఓఎన్‌జీసీ 2.01 శాతం (144.40 పాయింట్లు), యాక్సిస్ బ్యాంక్ 1.75 శాతం (748.85 పాయింట్లు), ఐటీసీ 1.57 శాతం (261.60 పాయింట్లు), సన్ ఫార్మా 1.25 శాతం (439 పాయింట్లు), బజాజ్ ఫైనాన్స్ 1.11 శాతం (4,069.75 పాయింట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.85 శాతం (1,240.35 పాయింట్లు) చొప్పున లాభాలను ఆర్జించాయి. అయితే, ఎస్ బ్యాంక్ 5.46 శాతం, టీసీఎస్ 3 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 2.81 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.28 శాతం, టాటా మోటార్స్ 1.58 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం నాటి లావాదేవీల్లో జీ ఎంటర్‌టైనె్మంట్ షేర్లు ఒకేసారి 18.76 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్ 6.72 శాతం, ఇండస్‌ఇండ్ 5.08 శాతం, టాటా స్టీల్ 4.98 శాతం, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 4.21 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, ఎస్ బ్యాంక్ 5.40 శాతం, టీసీఎస్ 3.03 శాతం, ఐఓసీ 2.83 శాతం, మహీంద్ర అండ్ మహీంద్ర 2.75 శాతం, ఇచర్ 2.49 శాతం చొప్పున నష్టపోయాయి.