బిజినెస్

దేశానికే తెలంగాణ దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 1: దేశానికే దిక్సూచిగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇండస్ట్రియల్ పార్కుకు భూమిపూజ చేశారు. ఇండస్ట్రియల్ పార్కు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన పారిశ్రామికవేత్తల ప్రత్యేక సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఎస్‌ఐపాస్ ఆధ్వర్యంలో 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రూపకల్పన జరిగిందన్నారు. యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామన్నారు. ఇవ్వనిపక్షంలో డ్రీమ్ అప్రువల్ కింద అనుమతి వచ్చినట్టుగా భావించాలన్నారు. 16వ రోజు నుంచి అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారికి రోజుకు వెయ్యి వంతున జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి చెబితే ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు అబ్బురపడ్డారన్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రెండు వేల ఎకరాలలో విస్తరిస్తామని చెప్పారు. భూసేకరణ ప్రారంభించాలని, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని సూచించారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు కోసం పర్యావరణాన్ని తాకట్టుపెట్టబోమని స్పష్టం చేశారు. కాలుష్యరహిత పరిశ్రమల
ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయన్నారు. 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెద్ద పరిశ్రమల ఏర్పాటుతో పేరు తప్పా ప్రయోజనం శూన్యమన్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తక్కువ ధరలకే భూమి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పార్కులో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. త్వరలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల కేటాయింపుల్లో మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు త్వరలో జరుగనుందని కేటీఆర్ తెలిపారు. కాలుష్యంతో చెడ్డపేరు తేవద్దని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి రాజమల్లు, పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ తేర చిన్నపురెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.