బిజినెస్

థాయ్ ఎయిర్‌వేస్ చైర్మన్ నితితాన్‌ప్రపాస్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 2: థాయ్ ఎయిర్‌వేస్ చైర్మ న్ ఎక్నిటీ నితితాన్‌ప్రపాస్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. థాయ్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో, ఆయన పనితీరుపై కొద్దికాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజీనామా చేసితీరాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తున్నది. మరోవైపు కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితితాన్‌ప్రపాస్ తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం సంస్థకు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎయిర్ చీఫ్ మార్షల్ చై యాప్రక్ దిద్యిసరిన్ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరని థాయిలాండ్ సర్కారు ప్రకటించింది. అయితే, నితితాన్‌ప్రపాస్ ఎందుకు రాజీనామా చేశారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. థాయ్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య, మొదటి త్రైమాసికం లో 220 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని ఎదుర్కోవడమే రాజీనామాకు కారణమని సమాచారం.