బిజినెస్

మార్కెట్లకు ఊతమిచ్చిన వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 2: భారత స్టాక్ మార్కెట్ ఈవారం మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఐదు రోజుల లావాదేవీల్లో సెస్సెక్స్ 1,106.97 పాయింట్లు (2.83 శాతం) పెరిగింది. నిఫ్టీ కూడా లాభాల బాటలోనే నడిచింది. 306.70 పాయింట్లు (2.64 శాతం) మెరుగుపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో, దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. మెటల్, టెలికాం, బ్యాంకెక్స్, రియాల్టీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎఫ్‌సీజీ రంగాలు లాభాలను ఆర్జించాయి. ఈ రంగాలకు చెందిన షేర్లు సగటున 2.50 శాతం లాభపడ్డాయి. ఐటీ, ఆటో, కేపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, టెక్నాలజీ రంగాలు సగటు 1.16 శాతం నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే, షాంఘై, హాంకాంగ్, సియోల్ లాభాల్లో నడిచాయి. యూరోపియన్ యూనియన్‌లో స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. వారం మొత్తంలోనూ మెరుగైన ఫలితాలను సాధించిన బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ శుక్రవారం 35.98 పాయింట్లు (0.09 శాతం) పెరిగి, 40,165.03 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 13.15 పాయింట్లు (0.11 శాతం) మెరుగుపడి, 11,890.60 పాయింట్లుగా నమోదైన విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు పతనం నుంచి తప్పుకోవడమేగాక, ఆల్‌టైమ్ రికార్డు సమీపానికి వెళ్లగలగడాన్ని విశేషంగానే చెప్పుకోవాలి. ఈ వారంలో ట్రేడింగ్ జరిగిన ఐదు రోజుల్లో, మూడు రోజులు సెనె్సక్స్ 3ఆల్‌టైమ్ హై2 స్థాయికి చేరుకొని, ఆతర్వాత కొంత పతనం కావడంతో స్వల్ప లాభాలతో ముగిసింది. ఒకవేళ అమెరికా రిజర్వ్ ఫండ్ వడ్డీ రేటు కోతపై సస్పెన్స్ లేకపోతే, గతంలో ఎన్నడూలేనంత ఉన్నతంగా సెనె్సక్స్ పాయింట్లు నమోదై ఉండేది. ఏదిఏమైనా, ఈవారం స్టాక్ మార్కెట్లకు గొప్ప ఊతాన్నిచ్చింది. ఆర్థిక మాంద్య పరిస్థితులు నెకొంటున్నాయన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, అత్యంత కీలకమైన టేకాఫ్‌ను అందించింది. దేశంలోని పేరొందిన వివిధ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలను వెలువడుతున్న తరుణంలో, సహజంగానే మదుపరులు తమతమ పెట్టుబడులను స్టాక్స్ కంటే ఎక్కువగా బులియన్ లేదా ఇతరత్రా మార్కెట్లలో ఉంచడం సహజం. ఇది సాధారణ ప్రక్రియ. అయితే, రూపాయి మారకపు విలువ అస్థిరంగా ఉండడంతో, విదేశీ మదుపరులు స్టాక్ మార్కెట్‌పైనే దృష్టిని కేంద్రీకరించినట్టు స్పష్టమైంది. ఈ కారణంగానే, భారత స్టాక్ మార్కెట్లు నష్టాలబారిన పడకుండా తప్పించుకోగలిగాయి. ఇదే పరిస్థితి వచ్చే వారంలోనూ కొనసాగుతుందనేది విశే్లషకుల అభిప్రాయం.