బిజినెస్

ఎనిమిది కంపెనీల విలువలో పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: మిడ్ క్యాప్‌లో ‘టాప్ టెన్’ జాబితాలోని ఎనిమిది కంపెనీలు గత వారం లాభాల పంట పండించాయి. వాటి మార్కెట్ విలువ ఏకంగా 1.34 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. శుక్రవారంతో ముగిసిన లావాదేవీల్లో మార్కెట్ కేపిటలైజేషన్ ర్యాలీ కొనసాగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లాభపడితే, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ నష్టాలను చవిచూశాయి. గత వారం మార్కెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే, పది మేటి కంపెనీల్లో ఎనిమిది గణనీయమైన లాభాలు ఆర్జించి, విలువను పెంచుకున్నాయి. అన్ని కంటే ఎక్కువగా టీసీఎస్ విలువ 28,893.36 కోట్ల రూపాయలు పెరిగి, 8,26,293.87 కోట్ల రూపాయలకు చేరింది. అదే విధంగా ఇన్ఫోసిస్ 24,704.61 కోట్ల రూపాయలు లాభపడడంతో, మార్కెట్ విలువ 2,98,535.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) 16,671.95 కోట్ల రూపాయలు మెరుగుపడి, 9,23,613.71 కోట్లుగా ముగిసింది. హిందుస్థాన్ యూనీలెవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) విలువ 7,977.33 కోట్లు పెరగడంతో, 4,71,864.08 కోట్ల రూపాయలకు చేరింది. అదే విధంగా, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ 4,428.96 కోట్ల రూపాయలు పెరగడంతో, గత వారాంతానికి 3,67,534.58 కోట్ల రూపాయలుగా స్థిరపడింది. ఐటీసీ 16,525,33 కోట్ల రూపాయలు మెరుగుపడడంతో 3,21,045,99 కోట్ల రూపాయలకు మార్కెట్ విలువను పెంచుకుంది. ఇలావుంటే, కోటక్ మహీంద్ర మార్కెట్ విలువ గత వారం 1,456.04 కోట్ల రూపాయలు పతనమై, 3,01,837.35 కోట్ల రూపాయలకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ విలువ 4,519.55 కోట్ల రూపాయల మేరకు పెరగి, 2,98,535.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. స్థూలంగా చూస్తే, గత వారాంతపు నివేదికల ప్రకారం, భారత టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆతర్వాతి స్థానాల్లో వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి.