బిజినెస్

బుల్ రన్‌కు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 5: వరుసగా ఏడు సెషన్స్ సాగిన బుల్ రన్‌కు మంగళవారం బ్రేక్ పడింది. ఒకానొక దశలో ఆల్ టైమ్ రికార్డుకు చేరువైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 53.73 పాయింట్లు (0.13 శాతం) పతనమై 40,248.23 పాయింట్ల వద్ద ముగిసింది. నిజానికి సోమవారం మాదిరిగానే 30 షేర్ బీఎస్‌ఈ సూచీలు లాభసాటిగా ప్రారంభమయ్యాయి. ఈ ర్యాలీ కొంతసేపు కొనసాగడంతో 40,466.55 పాయింట్లకు చేరింది. అయితే, ఆ తర్వాత క్రమంగా పతనమవుతూ వచ్చింది. లాభాల్లో ఉన్న వాటాలను అమ్మేసి సొమ్ము చేసుకోవాలని మదుపర్లు అనుకోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఒక దశలో 40,053.55 పాయింట్లకు పతనమైంది. అయితే, చివరిలో దేశీయ మదుపరులు కొంతమేరకు ఆసక్తి చూపడం, రూపాయి మారకపు విలువ అనిశ్చితి నేపథ్యంలో విదేశీ మదుపరులు కూడా పెట్టుబడుల పట్ల మొగ్గుచూపడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌కు కొంతవరకు ఊతమిచ్చాయి. చివరకు భారీ నష్టం లేకుండా కొద్దిపాటి నష్టంతో సెనె్సక్స్ బయటపడింది. సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 24.10 పాయింట్లు (0.20 శాతం) నష్టపోయి 11,917.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు బీఎస్‌ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలో ఏడు సెషన్స్‌పాటు కొనసాగిన లాభాల బాటకు మార్కెట్ సెంటిమెంట్స్ అడ్డుకట్ట వేశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడే రీతిలో చర్చలు జరుగబోతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కొంతవరకైనా పుంజుకుంది. లేకపోతే నష్టం భారీగా ఉండేదని విశే్లషకుల అభిప్రాయం. దేశీయ మార్కెట్ ర్యాలీ కొనసాగడం కూడా మార్కెట్లకు భారీ నష్టాలపాటు కాకుండా కాపాడాయి. సెనె్సక్స్‌లో ఎస్ బ్యాంక్ అత్యధికంగా 3.40 శాతం లాభపడింది. ఓపెన్ మార్కెట్ ద్వారా 87 కోట్ల రూపాయలతోపాటు పెట్టుబడిదారులు రాకేష్ ఝంఝన్‌వాలా 1.3 కోట్ల రూపాయల వాటాలను తీసుకోవడంతో ఎస్ బ్యాంకు షేర్లు లాభాల బాటన నడిచాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఐటీసీ, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు సగటున 2.77 శాతం లాభాలను ఆర్జించాయి. కాగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు సగటున 2.40 శాతం నష్టాలను చవిచూశాయి. రంగాలవారీగా పరిశీలిస్తే కన్జూమర్ డ్యూరబుల్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలు నష్టాలను చవిచూశాయి. అయితే, ప్రతికూల పరిస్థితులను తట్టుకున్న టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగాలు సగటున 1.47 శాతం లాభాలను ఆర్జించాయి. స్థూలంగా చూస్తే ఇటీవల కాలంలో లాభాల్లో నడుస్తున్న వాటాలను సరైన సమయంలో, సరైన ధరకు విక్రయించేందుకే పెట్టుబడిదారులు మొగ్గుచూపడంతో బుల్ ర్యాలీకి బ్రేక్ పడింది. అమెరికా, చైనా దేశాల మధ్య చర్చలు జరిగి, వాణిజ్య ఒప్పందాల వివరాలు బయటపడేవరకు స్టాక్ మార్కెట్స్‌లో ఈ ఆటుపోట్లు తప్పవని అంటున్నారు.