బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 6: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో ఏడు సెషన్స్‌పాటు లాభాలను ఆర్జించి, మంగళవారం హఠాత్తుగా స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. పెట్టుబడులకు విదేశీ మదుపరులు ఆసక్తి ప్రదర్శించడంతో ఆరంభంలో మందకొడిగా సాగిన లావాదేవీలు క్రమేణా పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో 30 షేర్ సెనె్సక్స్ ఆరంభంలో స్తబ్ధంగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో ఒక్కసారిగా పుంజుకుంది. ఒకానొక దశలో ఆల్‌టైమ్ ఇన్‌ట్రా డే అత్యధిక సూచీ 40,606.91 పాయింట్లకు చేరుకుంది. అయితే, చివరిలో షేర్ల అమ్మకాల డిమాండ్ పెరగడంతో బుల్ ర్యాలీ బ్రేక్ పడింది. అయితే, నష్టాల నుంచి కోలుకుని, 221.55 పాయింట్లు (0.55 శాతం) లాభపడి 40,469.78 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ ఒక దశలో 12,000 పాయింట్లకు చేరింది. అయితే, బీఎస్‌ఈ మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ చివరిక్షణంలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్వల్పంగా పెరిగిన నిఫ్టీ 11,966.05 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారంతో పోలిస్తే ఇది 48.85 పాయింట్లు (0.41 శాతం) ఎక్కువ. రియాలిటీ రంగానికి ఊతమిచ్చే ప్రణాళికను త్వరలోనే ప్రకటించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన తాజా ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపెట్టింది. కార్పొరేట్ రంగానికి కేంద్రం సానుకూలంగా ఉన్నదన్న సంకేతాలు రావడంతో వివిధ కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు అత్యధికంగా 2.64 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్ 2.37 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.78 శాతం, ఇండస్‌ఇండ్ 1.74 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.42 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. జాతీయ, అంతర్జాతీయ సూచికలు సానుకూలంగానే ఉన్నప్పటికీ భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అనూహ్యంగా 3.31 శాతం నష్టాన్ని చవిచూశాయి. రిలయన్స్ 1.07, బజాజ్ ఫైనాన్స్ 1.04, ఓఎన్‌జీసీ 1.03, మారుతీ సుజుకి 1.00 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ స్వలంగా లాభపడగా, సిప్లా కంపెనీ షేర్లు అత్యధికంగా 3.02 శాతం లాభాలను ఆర్జించాయి. ఐసీసీఐ బ్యాంక్ 2.49 శాతం, ఇన్ఫోసిస్ 2.36 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.82 శాతం, ఇండస్‌ఇండ్ 1.81 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా టైటాన్ కంపెనీ షేర్ల ధర ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా 10.09 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్ 3.44 శాతం, ఓఎన్‌జీసీ 1.26 శాతం, భారతీ ఫిన్‌సర్వ్ 1.25 శాతం, మారుతీ సుజుకి 1.07 శాతం చొప్పున నష్టపోయాయి. స్థూలంగా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు సగటున 2.59 శాతం లాభాలను సంపాదించాయి.