బిజినెస్

లండన్ కోర్టులో నీరవ్ మోదీ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసగించి పెద్ద మొత్తంలో రుణం తీసుకొని, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బుధవారం బ్రిటన్‌లోని ఒక కోర్టు ఎదుట హాజరయ్యారు. నీరవ్ మోదీ బెయిల్ కోసం పెట్టుకున్న తాజా పిటిషన్‌ను ఈ కోర్టు విచారిస్తోంది. పీఎన్‌బీని సుమారు 2బిలియన్ డాలర్ల మేరకు మోసగించిన కేసులో నీరవ్ మోదీని తనకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌ను కోరుతోంది. 48 ఏళ్ల నీరవ్ మోదీని పోలీసులు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు బుధవారం హాజరుపరిచారు. బెయిల్ పొంది వచ్చే సంవత్సరం మే నెలలో జరుగనున్న తన విచారణ వరకు బయట ఉండాలని నీరవ్ మోదీ ప్రయత్నిస్తున్నాడు. నీరవ్ మోదీ మార్చిలో అరెస్టయినప్పటి నుంచి నైరుతీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నాడు. నీరవ్ మోదీ ఈ సంవత్సరం తొలినాళ్లలో ఇదే కోర్టులో హాజరయినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడింది. ‘బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు నవంబర్ 6న (బుధవారం) వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. విచారణ పూర్తయ్యేంత వరకు బెయిల్ కోసం పెట్టుకున్న కారణాలు బహిరంగ పరచడం కుదరదు’ అని యూకేకు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) అధికార ప్రతినిధి తెలిపారు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే కేసులో కోర్టులో భారత ప్రభుత్వానికి సీపీఎస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. నీరవ్ మోదీ వ్యాకులత, కుంగుబాటుతో బాధపడుతున్నట్టు తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడని తెలిసింది. మోదీ బెయిల్ కోసం ఇంతకు ముందు పెట్టుకున్న పిటిషన్లను చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నోట్ తోసిపుచ్చారు. చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలను మోదీ లండన్ హైకోర్టులో సవాలు కూడా చేశాడు.