బిజినెస్

ఆర్థిక అంశాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కీలక స్థూలార్థిక అంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే అవకాశం ఉంది. ఎందుకంటే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ దాదాపు ముగింపునకు వస్తోందని, అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొత్తంమీద ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని మార్కెట్ విశే్లషకులు అంచనా వేశారు. ఈక్విటీ మార్కెట్లు గురునానక్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పనిచేయవు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన నేపథ్యంలో మదుపరులు సోమవారం పారిశ్రామికోత్పత్తి గణాంకాలను, మంగళవారం ద్రవ్యోల్బణం రేటును, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను నిశితంగా పరిశీలిస్తారు. సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న ప్రధాన కంపెనీలలో కోల్ ఇండియా లిమిటెడ్, హిండాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌ఎండీసీ ఉన్నాయి. దేశంలో సామాజిక అశాంతి ఏర్పడనంత వరకు అయోధ్య తీర్పు ఈక్విటీ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపబోదని ట్రేడింగ్‌బెల్స్‌లో సీనియర్ అనలిస్ట్ సంతోశ్ మీనా తెలిపారు. ‘మార్కెట్‌లో షేర్ల ధరల పెరుగుదలకు అనుకూలమయిన ధోరణి నెలకొని ఉంది. ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది’ అని మీనా వివరించారు. ‘దాదాపు ఆల్ టైమ్ హై స్థాయిల వద్ద ట్రేడింగ్ అవుతున్న ఈక్విటి మార్కెట్లు ఈ వారం రెండు ముఖ్యమయిన గణాంకాలను ఎదుర్కోనున్నాయి. ఈ రెండు గణాంకాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత పుంజుకోవడానికి లేదా ఒత్తిడికి గురికావడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం 330 పాయింట్లు పడిపోయింది. మొత్తంమీద గత వారం సెనె్సక్స్ 158.58 పాయింట్లు (0.39 శాతం) పుంజుకుంది.