బిజినెస్

గత నెలలో 3 శాతం పెరిగిన మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: నిర్థిష్టమైన పెట్టుబడుల ప్రణాళికలు (ఎస్‌ఐపీలు) అమలు చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత అక్టోబర్ మాసంలో రూ. 8,246 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే ఇది 3.2 శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం వరుసగా చేపట్టిన పలు ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే సంస్కరణల క్రమంలో స్టాక్ మార్కెట్లు బలపడడం మ్యూచువల్ ఫండ్లలోకి సైతం పెట్టుబడులు పెరిగేలా చేసిందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో రూ. 57,607 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఈ కాలంలో రూ. 52,472 కోట్ల పెట్టుబడులు సమకూరినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) గణాంకాలు తెలిపాయి.