బిజినెస్

రేబిస్ చికిత్సకు కైరోర్యాబ్ వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: రేబిస్ చికిత్సకు కైరోర్యాబ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం భారత డ్రగ్ కంట్రోల్ అధికారి డా. ఎస్ ఈశ్వర్‌రెడ్డి, కేంద్ర బయోటెక్నాలజీ కార్యదర్శి డా. రేణు స్వరూప్, భారత్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ఎబోలాతో కాంగో, గన్యాతో మడగస్కర్ పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రేబిస్ వ్యాక్సిన్‌ను గుజరాత్‌లోని అంఖలేశ్వర్‌లో ఖైరాస్ బెహ్రింగ్ కంపెనీ గత 40 ఏళ్లుగా ఉత్పత్తి చేస్తోందని, ప్రస్తుతం భారత్ బయోటెక్ కొనుగోలు చేసిందని అన్నారు. అక్కడ నుంచే ఈ వ్యాక్సిన్‌ను తాము తయారు చేస్తున్నామని, దాన్ని కైరోర్యాబ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన విధంగా టెండర్ల ద్వారా కైరోర్యాబ్ వ్యాక్సిన్‌ను అందిస్తామని, మిగిలిన వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామని కృష్ణ ఎల్లా వెల్లడించారు.