బిజినెస్

దక్షిణ అమెరికాకు తెలంగాణ ఫార్మా ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి కోసం హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా విమాన సర్వీస్ ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు దక్షిణ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. అమెరికా పర్యటనకు వెళ్లిన వినోద్‌కుమార్ తిరుగు ప్రయాణంలో డల్లాస్‌లో ఆగారు. ఈ సందర్భంగా డల్లాస్ ఫోర్ట్ వర్త్ అధ్యక్షుడు నీల్ గోనుకుంట్ల నేతృత్వంలో ప్రతినిధులు వినోద్‌తో సమావేశమయ్యారు. దక్షిణ అమెరికాలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు స్థిరపడ్డారని, ఇక్కడ స్థిరపడిన తెలంగాణవాసులు మాతృభూమికి చెందిన ఫార్మా ఉత్పత్తులపై మక్కువ చూపుతున్నట్టు వారు వివరించారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు డల్లాస్, పోర్ట్‌వర్త్‌లో ఎక్కువగా స్థిరపడటంతో రవాణా సౌకర్యం కూడా కల్పించినట్టు అవుతుందని సూచించారు. పార్లమెంట్‌లో నూతన విద్యాపాలసీకి ఆమోదం లభించనుందని, దీని వల్ల విదేశీ విశ్వవిద్యాలయాలపై దేశంలో ఉన్న నిషేదం తొలిగిపోతే తెలంగాణకు మహార్దశ పట్టనుందని వినోద్‌కుమార్ వారికి వివరించారు.
*చిత్రం... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్‌తో సమావేశమైన దక్షిణ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు