బిజినెస్

త్వరలో జిఎస్‌టి కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 10: ప్రతిష్టాత్మకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఇప్పుడు చట్టంగా మారడంతో ప్రభుత్వం తర్వలో జిఎస్‌టి కౌన్సిల్‌ను ఏర్పాటుచేసి పరోక్ష పన్నుల పెను భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది వినియోగదారులను, 2 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థను తొలిసారి ఒకే మార్కెట్ పరిధిలోకి తీసుకురానున్న వస్తు, సేవల పన్నును గత నెలలో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 19-20 రాష్ట్రాలు కూడా ఆమోదించడంతో ఇప్పుడు అది రాష్టప్రతి అనుమతి పొందేందుకు అర్హత సాధించిందని చెన్నైలో శనివారం జరిగిన కరూర్ వైశ్యా బ్యాంక్ శత వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ స్పష్టం చేశారు. ‘మన దేశంలో ప్రవేశపెట్టదలుచుకున్న ఒకేవిధమైన వస్తు, సేవల పన్ను రేటను నిర్ణయించాల్సిన బాధ్యత జిఎస్‌టి కౌన్సిల్‌పై ఉంది. కనుక జిఎస్‌టి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలోనే తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నా’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ లాంటి పలు రకాల కేంద్ర, రాష్ట్ర పన్నుల స్థానంలో అమలులోకి తీసుకొస్తున్న జిఎస్‌టి కేవలం ఒకే విధమైన పన్ను రేటు మాత్రమే కాదని, సింగిల్ పాయింట్ పన్ను వ్యవస్థగా కూడా ఉంటుందని రాష్టప్రతి వివరిస్తూ, దీని వలన పరోక్ష పన్నుల పెను భారం నుంచి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వస్తు, సేవల పన్ను బిల్లును పార్లమెంట్‌తో పాటు పలు రాష్ట్రాలు ఆమోదించడంతో గత 15 సంవత్సరాల నుంచి సాగుతున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయన్నారు.
స్థూల జాతీయోత్పత్తిలో గత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం వృద్ధి రేటును సాధించిన భారత్ తనంతట తానుగా ప్రపచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రణబ్ శ్లాఘించారు. ‘2016, 2017లో మన దేశం 7.5 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే దిశగా దూసుకెళ్తుండటంతో మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, అవకాశాలు మెరుగుపడ్డాయని గట్టిగా చెప్పగలం’ అని రాష్టప్రతి పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 1.3 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2015-16లో 1.1 శాతానికి మెరుగుపడటంతో ఎగుమతుల రంగం స్థిరంగా పురోగమిస్తోందని, దీనికి తోడు దేశంలో విదేశీ మారకద్రవ్య (్ఫరెక్స్) నిల్వలు 365 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ ఏడాది రుతుపవనాల కరుణతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా జరుగుతుందని, 2013-14లో సాధించిన 265 మిలియన్ టన్నుల అత్యధిక ఉత్పత్తి రికార్డును అధిగమించగలుగుతామని ఆశిస్తున్నట్లు ప్రణబ్ తెలిపారు.