బిజినెస్

మాంద్యం మాట కట్టుకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు మందగించిందన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, బ్యాంకుల విలీనం, పరిశ్రమలకు పన్నుల రాయితీలు సహా అనేక నిర్ణయాలను ఇటీవల ప్రకటించిందని తెలిపారు. ఐదు శాతం మేర ఆర్థిక వృద్ధిలో మాంద్యం చోటుచేసుకుందన్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్న ఆయన ‘ఈ లెక్కలు మీకు ఎక్కడ నుంచి వచ్చాయి. ఆధారాలు చూపించండి’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం వృద్ధి రేటు తగ్గలేదని మంత్రి తెలిపారు. 2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడంతోపాటు పరిశ్రమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎంహెచ్‌ఎంఈ రంగాలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేశంలోని అనేక బ్యాంకులను విలీనం చేయడంలో ప్రధాన ఉద్దే శం బ్యాంకింగ్ వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడమేనని, దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా మెరుగవుతాయని తెలిపారు. అలా గే, నల్లధనాన్ని నిరోధించేందుకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్న ఆయన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెండింతలు అయిందని అన్నారు. జాతీయ గణాంక కార్యాలయ లెక్కలను బట్టి 2014-19 మధ్య స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సగటున 7.5 శాతం ఉందని, ఏవిధంగా చూసినా ఇది జీ-20 కూటమి దేశాల్లో అత్యధికమని వెల్లడించా రు. గత ఐదేళ్ల కాలంలో దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఇవన్నీ కూడా భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినవేనని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సరళీకృత చర్యల వల్ల నిరంతరాయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయని, అదే క్రమంలో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలిగిందని, ద్రవ్య ఖర్చు విషయంలోనూ క్రమశిక్షణ పాటిస్తోందని తెలిపారు.
ఆరోగ్యకరమైన పెట్టుబడి వాతావరణాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో స్థూల ఆర్థిక స్థిరత్వానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి ప్రభుత్వం తగ్గిం చే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.