బిజినెస్

జిడిపి వృద్ధి 7.6 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, మార్చి 31: భారత దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తెలిపారు. అయితే దేశ సామర్ధ్యం కంటే ఇది ‘ఎంతో తక్కువ’ అని ఆయన పేర్కొంటూ, వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారానికి భారత్ అనువైనది కాదన్న దురభిప్రాయం గతంలో చాలా బలంగా ఉండేదని, అయితే ప్రస్తుతం వ్యవస్థను సంస్కరించి ఈ దురభిప్రాయాన్ని తొలగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పురోగతి సాధించాయని ఆయన చెప్పారు. ‘గురువారంతో ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జిడిపి వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. మా దేశ శక్తి, సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ వృద్ధి రేటు చాలా తక్కువ. అయినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మా దేశ జిడిపి వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నా’ అని జైట్లీ అన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో గురువారం ఆయన కెఆర్.నారాయణన్ ఆరేషన్ సిరీస్ లెక్చర్‌లో ‘న్యూ ఎకనమిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘ప్రస్తుతం భారత్‌లో మేము కరెంటు ఖాతా లోటుతో పాటు ద్రవ్యోల్బణ రేటును సమర్ధవంతంగా అదుపు చేయగలిగాం. గత 16 నెలల్లో టోకు ధరల సూచీ ప్రతికూలంగా ఉంది. వినిమయ ధరల సూచీ 4 నుంచి 5 శాతం మధ్య కదలాడుతోంది. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్నాయి. మా దేశంలో ఇంకా కొన్ని వ్యవస్థలను సంస్కరించాల్సి ఉన్నప్పటికీ, పన్నుల వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి భారత్‌లో వ్యాపారాన్ని ఇప్పటికే గణనీయ స్థాయిలో సులభతరం చేయగలిగాం. దీంతో అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో భారత్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది’ అని జైట్లీ అన్నారు. దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆవశ్యకత గురించి ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ, దీని అమలుతో భారత దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. మాజీ రాష్టప్రతి ఆర్‌కె.నారాయణన్ గౌరవార్థం ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీ చాలా కాలం నుంచి ఈ ప్రసంగ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇంతకుముందు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన భారత దేశ ప్రముఖుల్లో రాజా జె.చెల్లయ్య, జగదీష్ భగవతి, యుఆర్.రావు, పి.చిదంబరం తదితరులు ఉన్నారు.