బిజినెస్

ఫెడరల్ బ్యాంక్‌తో మారుతి సుజుకీ ఒప్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆటోమొబైల్ రీటెయిల్ ఫైనాన్సింగ్ సమస్యలకు వినియోగదారులకు పరిష్కారం చూపే విషయంలో ఫెడరల్ బ్యాంక్‌ను భాగస్వామిగా ఎంచుకున్నట్టు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. డీలర్ ఇనె్వంటరీ ఫండింగ్ విషయంలో ఫెడరల్ బ్యాంక్‌ను ఎంఎస్‌ఐఎల్ గత ఆగస్టులో భాగస్వామిగా చేర్చుకోవడం జరిగింది. ఈక్రమంలో వినియోగదారులకు ఫైనాన్సింగ్ విషయంలో ఇరు సంస్థల మధ్య తాజా ఒప్పందం కుదిరింది. ఇందువల్ల కస్టమర్లతోబాటు మారుతీ సుజుకీ డీలర్లకు సైతం సులభతర రుణ సౌకర్యం కలుగుతుందని మారుతి సుజుకీ వెల్లడించింది. ఫెడరల్ బ్యాంకుకు చెందిన పాన్ ఇండియా ద్వారా వినియోగదారులకు సేవలు విస్తృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
కస్టమర్లకు నాణ్యతతో కూడిన సేవలందించి వారిని ఆనంద పరచేడమే ఇరు సంస్థల లక్ష్యమని ఎంఎస్‌ఐ మార్కెటింగ్, విక్రయాల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అలాగే ఈ భాగస్వామ్యంతో మారుతీ సుజకీ మార్కెటింగ్ సౌకర్యాలు, డీలర్ భాగస్వాములకు మంచి ప్రయోజనాలను కలుగుతుందని నమ్ముతున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు.