బిజినెస్

ఎస్‌బిఐ చీఫ్ పదవి పొడిగింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకులు సహా, భారతీయ మహిళా బ్యాంకు (బిఎంబి) విలీన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఎస్‌బిఐ చీఫ్‌గా అరుంధతీ భట్టాచార్య మూడేళ్ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే బిఎంబి సహా అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బిఐని స్థిరీకరించే ప్రక్రియ కొనసాగుతున్నందున ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే బ్యాంక్ బోర్డు బ్యూరో (బిబిబి) అభిప్రాయాలను కూడా స్వీకరించిందని, కనుక అరుంధతీ భట్టాచార్య పదవీ కాలం పొడిగింపుపై మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

చిత్రం.. అరుంధతీ భట్టాచార్య