బిజినెస్

కొనసాగిన బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: భారత స్టాక్ మార్కెట్లలో ఈవారం బుల్న్ కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 671.83 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 117 పాయింట్ల చొప్పున పెరిగింది. ఐదు రోజుల ట్రేడింగ్‌లో ఒక రోజును మినహాయిస్తే, మిగతా రోజుల్లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈ ఆర్థిక సంవత్సరం, మూడో త్రై మాసికం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు గురికాకుండా సజావుగా సాగిపోయాయి. అంతర్జాతీయ సూచీలు సైతం సానుకూల ధోరణులను ప్రదర్శించడంతో, భారత స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నది.
బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ సోమవారం ఉదయం సానుకూలంగా ఆరంభమై తాజా జీవనకాల గరిష్ట స్థాయి 41,185.03 పాయింట్లను చేరింది. అయతే, తర్వాత ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఇంధన స్టాక్స్‌తోబాటు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ సైతం తీవ్రంగా నష్టపోవడంతో చివరికి 70.99 పాయింట్ల (0.17 శాతం) కోల్పోయి 40.938.72 పాయింట్ల దిగువకు చేరింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 32.75 పాయింట్లు (0.27 శాతం) కోల్పోయి 12,053.95 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈ సూచీలోని 50 షేర్లలో 37 నష్టాలపాలయ్యాయి. ఇలావుంటే, సానుకూల అంతర్జాతీయ పరిణామాల క్రమంతోబాటు స్థిరంగా సాగుతున్న విదేశీ పెట్టుబడుల కారణంగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయి లాభాలను అందుకున్నాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఓ దశలో 41,401.65 పాయింట్ల ఇంట్రాడే అత్యధిక స్థాయిని తాకింది. చివరికి 413.45 పాయింట్ల (1.01శాతం) భారీ ఆధిక్యతతో 41,352.17 పాయిం ట్ల ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అలాగే నిఫ్టీ 111.05 పాయింట్లు (0.92 శాతం) లాభపడి రికార్డు స్థాయి ముగింపు గరిష్టం 12,165 పాయిం ట్ల ఎగువన ముగిసింది. ఇక బుధవారం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల పరుగుతీసింది. ఇంట్రాడేలో ఓ దశలో అత్యధిక రికార్డు స్థాయి 41,614.77 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరికి 206.40 పాయింట్లు (0.50 శాతం) లాభపడి ఆల్‌టైం ముగింపు గరిష్ట స్థాయి 41,558.57 పాయింట్లుగా నమోదైంది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 56.65 పాయింట్లు (0.47 శాతం) ఆధిక్యతతో రికార్డు ముగింపు గరిష్టం స్థాయి 12,221.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరుసటి రోజైన గురువారం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే లాభాల ర్యాలీ తీసి 115.35 పాయింట్లు (0.28 శాతం) లాభపడి సరికొత్త ముగింపు గరిష్టం 41,673.92 పాయంట్ల వద్ద ముగిసింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 38.05 పాయింట్లు (0.31 శాతం) ఆధిక్యతతో 12,259.70 పాయింట్ల సరికొత్త ఆధిక్యతను నమోదు చేసింది.
ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఓ దశలో రికార్డు స్థాయి ఇంట్రాడే గరిష్టం 41,809.96 పాయింట్లను తాకిన ఈ సూచీ తర్వాత ఈ సూచీ చివరిగా 7.62 పాయింట్లు (0.02 శాతం) స్వల్ప ఆధిక్యతతో 41,681.54 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 12.10 పాయింట్ల (0.09 శాతం) లాభపడి 12,271.80 పాయంట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ సైతం ఓ దశలో ఇంట్రాడే గరిష్ట స్థాయి 12,293.90 పాయింట్లను స్పృశించింది. మొత్తం మీద, స్థూలంగా చూస్తే, ప్రతికూల పరిస్థితులను క్రమంగా అధిగమిస్తున్న స్టాక్ మార్కెట్లు గాడిన పడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే, మూడో త్రైమాసికం ముగింపు దగ్గరపడుతున్న తరుణంలో మార్కెట్లు ఎలాంటి మలుపులు తీసుకుంటాయన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.