బిజినెస్

చేపల వ్యాపారులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 18: ఆక్వా రంగం అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ఎగుమతుల పెంపుపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్థానికంగా చేపల వినియోగం పెంచడంపై కూడా దృష్టిసారించింది. చేపలు ఆరోగ్యపరంగా ఎంతో విలువైన, బలవర్థకమైన మాంసాహారంగా వైద్యులు సైతం సూచించే సంగతి అందరికీ తెలిసిందే. చేపల వినియోగం పెంచడం ద్వారా అటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం లభించడంతోపాటు, ఇటు ఈ వ్యాపారంపై ఆధారపడే స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా పరిపుష్టి కలిగించవచ్చనేది ప్రభుత్వ యోచనగావుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వార్షిక తలసరి చేపల వినియోగం 9.5 కిలోలుగా ఉంది. దీన్ని 13 కిలోలకు పెంచడం ద్వారా ప్రజల్లో పోషకాహార లోపాలను తగ్గించవచ్చు. ఇందుకోసం రాష్ట్రంలో సాంప్రదాయ చేపల అమ్మకాన్ని వ్యవస్థీకృతం చేయడానికి పరిశుభ్రమైన వాతావరణంలో తాజా చేపలు వినియోగదారులకు లభించేలా చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు స్థానికంగా చేపలు తదితర ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలపై ఆధారపడుతుంటారు. వీరంతా వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి కోసం రోజువారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీరి శ్రమలో అధికశాతం ఈ వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది. ఇలాంటి వారికి చేయూతనివ్వడానికి ప్రధానమంతి ముద్రా యోజనను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గుర్తించింది. ఇలా రోజువారీ వ్యాపారాలు సాగించే వారి నుండి చిన్నతరహా పరిశ్రమల స్థాయిలో చేపల వ్యాపారాలు సాగించే వారికి సైతం రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా మత్స్యపరిశ్రమకు సంబంధించి శిశుపథకం, కిశోర పథకం, తరుణ్ అనే మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను బ్యాంకులు అందిస్తాయి. చేపల పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది రకాల వ్యాపారులను గుర్తించింది. మార్కెట్‌లో తాజా చేపల అమ్మకం, ఎండు చేపల అమ్మకం, హర్బర్‌లో రిక్షాపై చేపల రవాణా, సంచార చేపల వాహనం, త్రిచక్ర సంచార చేపల వాహనం, చేపల రిటైల్ దుకాణం, బతికిన చేపల అమ్మకం, ఎండుచేపల పరిశ్రమ, చేపల కియోస్క్‌దారులకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం గుర్తించింది. ముద్రా పథకం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీపై తిరిగి చెల్లించడానికి సౌకర్యవంతమైన కాలపరిమితితో వీరికి రుణాలు అందిస్తారు. తొలుత పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేసి, తదనంతరం గ్రామీణ ప్రాంతాలకూ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు అనుగుణంగా తగు ఆదేశాలుజారీచేశారు. ఇందులో భాగంగా మత్స్యశాఖ అధికారులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేపల వ్యాపారులతో సమావేశాలను ఏర్పాటుచేసి పథకం ప్రయోజనాలు వివరిస్తున్నారు.