బిజినెస్

రక్షిత విధానాలతో ఎగుమతులకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: అంతర్జాతీయంగా అనిశ్చిత మార్కెట్ పరిస్థితులు, రక్షిత వాదం బలంగా నెలకొన్న నేపథ్యంలో కూడా భారతీయ ఎగుమతులు సమీప భవిష్యత్తులో 330-340 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారుల సంస్థ (ఎఫ్‌ఐఈఓ) సోమవారంనాడు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో ఎగుమతులు రెండు శాతం మేర అంటే 212 బిలియన్ డాలర్ల మేర తగ్గాయని భారత ఎగుమతుల సంస్థల సమాఖ్య అధ్యక్షుడు శరత్ కుమార్ షరాఫ్ తెలిపారు. అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులు అత్యంత సవాళ్లమయంగా మారుతున్నాయని, ముఖ్యంగా రక్షితవాదం వేళ్లూనుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఇవన్నీ కూడా ఎగుమతులపై కచ్చితమైన ప్రభావాన్ని కనబరిచే అవకాశం ఉందని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు తనదైన వాటా ఉందని పేర్కొన్న ఆయన ‘ప్రపంచవ్యాప్తంగా దిగుమతులు తగ్గితే భారత ఎగుమతులు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో భారత ఎగుమతులు 1.99 శాతం మేర తగ్గాయి’ అని అన్నారు. దీని దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 330 నుంచి 340 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చునని అంచనా వేస్తున్నామని అన్నారు. అయితే, ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని గుణాత్మక చర్యల వల్ల ఎగుమతుల్లో పోటీతత్వం, తద్వారా నాణ్యత పెంపొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రపంచ వాణిజ్య పరిస్థితులు మెరుగుపడితే భారతదేశ ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న దిగుమతుల విధానాన్ని అనుసరించే ఎగుమతులు ఉంటాయని పేర్కొన్న ఆయన 50 శాతానికి పైగా అంతర్జాతీయ దిగుమతుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మిషనరీ, పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఉన్నాయని, అయితే, భారత ఎగుమతుల్లో వీటి వాటా 33 శాతం కంటే తక్కువేనని తెలిపారు.