బిజినెస్

పేలవంగా మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: దేశీయంగాను, అంతర్జాతీయంగాను ఎలాంటి స్పష్టమైన సంకేతాలు లేని నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ స్పందనతోనే ముగిశాయి. సోమవారం వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ లావాదేవీలు ముగిసేనాటికి 17.14 పాయింట్లు పెరిగి 41,568 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10.05 పాయింట్లు పుంజుకుని 12,255.85 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి. ఏకంగా 0.99 శాతం విలువను కోల్పోయాయి. నష్టపోయిన కంపెనీలు వరుసలో టీసీఎస్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ షేర్లు పుంజుకున్నాయి. నేటి లావాదేవీలు మందకొడిగా సాగడానికి కారణం మార్కెట్‌కు ఊతాన్నిచ్చే సంకేతాలేవీ బలంగా లేకపోవడమేనని విశే్లషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కూడా షాంగై, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా పుంజుకుని ముగిశాయి. అయితే, టోక్యో, సియోల్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి రానున్న రోజుల్లో ఆటోమొబైల్ షేర్లలోనే ఇనె్వస్టర్ల దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, అలాగే జీడీపీ కూడా పెరుగుతుందన్న ఆశావహ అంచనాలు ఉన్నాయని విశే్లషకులు తెలిపారు. అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే భారత రూపాయి నాలుగు పైసలు పెరిగి 71.34 వద్ద ముగిసింది.