బిజినెస్

నిర్మాణ రంగ కార్మికులకు ఇఎస్‌ఐసి, ఇపిఎఫ్ ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, సెప్టెంబర్ 20: నిర్మాణ రంగ కార్మికులకు ఇసిఐఎస్, ఇపిఎఫ్ పథకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని, అలాగే ఇసిఐఎస్ కింద సైకిల్-రిక్షా డ్రైవర్లతో పాటు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు దశల వారీగా లబ్ధి చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మంగళవారం ప్రారంభమైన జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే నిర్మాణ రంగం నుంచి సెస్సు రూపంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను సక్రమంగా ఉపయోగించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లో జమ అయినప్పటికీ నిర్మాణ కార్మికుల శ్రేయస్సు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారిని దోపిడీకి గురిచేస్తున్నారని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగం నుంచి సెస్సు రూపంలో వసూలు చేసిన 27,886 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రాల ఖాతాల్లో మూలుగుతున్నాయని, వీటిలో ఇప్పటివరకూ కేవలం రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో మిగిలిన 22,086 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలు, ట్రెజరీల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. బిఓసిడబ్ల్యు (్భవన, ఇతర నిర్మాణ కార్మికుల) చట్టం-1996 కింద కేటాయించిన ఈ నిధులను న్యాయబద్ధంగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణ రంగం నుంచి సెస్సు రూపంలో వసూలు చేసిన 940 కోట్ల రూపాయలు ఒడిశా ఖాతాలో జమ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం రూ.120 కోట్లు మాత్రమే ఖర్చు చేయడాన్ని దత్తాత్రేయ ఈ సందర్భంగా ఉదహరిస్తూ, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి కేటాయించిన నిధులు పెద్ద మొత్తంలో దారి మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం.. జాతీయ కార్మిక సదస్సును ప్రారంభిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్