బిజినెస్

ఈ ఏడాది 10 నగరాలకు ఐఎన్‌ఐ వ్యాపార విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచంలో 21 దేశాలకు పండ్లను ఎగుమతి చేస్తున్న ప్రముఖ హార్టీకల్చర్ సంస్థ ఐఎన్‌ఐ ఫార్మ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 10 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జైపూర్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు మరో 10 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నామని ఐఎన్‌ఐ ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ఖండేల్వాల్ ముంబయిలో పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. దానిమ్మ, అరటి, అనాస తదితర పండ్లను ఎగుమతి చేస్తున్న తమ సంస్థ త్వరలో కొబ్బరి ముక్కలను కూడా ఎగుమతి చేయబోతోందని ఐఎన్‌ఎస్ ఫార్మ్స్ సిఇఓ పూర్ణిమా ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఏడాది దేశీయ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవడంతో పాటు మున్ముందు దీనిని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఖండేల్వాల్ స్పష్టం చేశారు.