బిజినెస్

భారత మార్కెట్లకు స్వల్ప నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మిగతా ఆర్థిక వ్యవస్థలతో మాదిరిగానే భారత్‌లో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే, స్వదేశీ మదుపరులు ఆదుకోవడంతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ స్వల్ప నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 51.73 పాయింట్లు పతనమై 40,815.74 పాయింట్లకు చేరింది. అదేవిధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో 27.60 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 12,025.35 పాయింట్లుగా నమోదైంది. తీవ్రమైన ప్రతికూల ధోరణులు ఏర్పడి, అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో బీఎస్‌ఈ లావాదేవీలు మందకొడిగా సాగాయి. ఒకదశలో రికార్డు స్థాయి నష్టాలు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, మధ్యాహ్నం తర్వాత స్వదేశీ మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తిని ప్రదర్శించడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది. కానీ వీరు సెనె్సక్స్‌ను నష్టం నుంచి కాపాడలేకపోయారు. ఎల్ అండ్ టీ అత్యధికంగా 2.19 శాతం నష్టపోయింది. ఓఎన్‌జీసీ (1.75 శాతం), టైటాన్ (1.43 శాతం), సన్ ఫార్మా (1.40 శాతం), హీరో మోటార్స్ (1.32 శాతం) షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. కాగా, ప్రతికూలతలు ఎదుర్కొన్న భారతీ ఎయిర్‌టెల్ 3.05 శాతం లాభాలను ఆర్జించింది. ఐటీసీ వాటాలు 2.26 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. అల్ట్రా టెక్ (1.62 శాతం), బజాజ్ ఫైనాన్స్ (1.06 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (0.99 శాతం) షేర్లు లాభాల్లో ముగిశాయి. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ కూడా మధ్యాహ్నం వరకు నష్టాల్లో కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. కానీ చివరకు స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ముగించింది. ఇచర్ మోటార్స్ వాటాలు అత్యంత దారుణంగా 4.34 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. కోల్ ఇండియా (2.25 శాతం), ఎల్ అండ్ టీ (2.20 శాతం), ఐఓసీ (1.97 శాతం), ఓఎన్‌జీసీ (1.83 శాతం) వాటాలకు అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో అవి నష్టాల్లోనే ట్రేడయ్యాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ భారతీ ఎయిర్‌టెల్ లాభాల బాటలో నడిచింది. ఈ కంపెనీ వాటాలు 3.05 శాతం లాభపడ్డాయి. ఎస్ బ్యాంక్ 2.22 శాతం లాభాలతో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ (2.15 శాతం), అల్ట్రా టెక్ (1.55 శాతం), బజాజ్ ఫైనాన్స్ (1.08 శాతం) షేర్లు కూడా బుధవారం నాటి ట్రేడింగ్‌లో లాభాలను ఆర్జించాయి.