బిజినెస్

గణనీయంగా పుంజుకోనున్న జౌళి, దుస్తుల ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: భారత్‌లో జౌళి, దుస్తుల ఎగుమతులు గణనీయంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న ఐదేళ్ళ కాలంలో వీటి ఎగుమతులు 300 బిలియన్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇనె్వస్ట్ ఇండియా అనే సంస్థ అంచనా వేసింది. ఈ ఐదేళ్ళ కాలంలోనే అంతర్జాతీయంగా జౌళి, దుస్తుల ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా ఐదు నుంచి 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2018లో దాదాపు 140 బిలియన్ డాలర్ల మేర జౌళి, దుస్తుల పరిశ్రమ ఉత్పత్తులు ఉంటే, వాటిలో వంద బిలియన్ డాలర్ల మేర దుస్తులు దేశంలోనే వినియోగమయ్యాయి. మిగతా 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేశారు. జౌళి, దుస్తుల పరిశ్రమ 2021 నాటికే 223 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వీటి వాటా 2.3 శాతం ఉంది. అలాగే మొత్తం పారిశ్రామిక ఉత్పత్తుల్లో 13 శాతం వాటాను కలిగి ఉంది. ఇక దేశ ఎగుమతుల ఆదాయం విషయానికి వస్తే, అందులోనూ జౌళి, దుస్తుల ద్వారా వచ్చే ఎగుమతుల వచ్చే ఆదాయం 12 శాతం మేర ఉంది. దేశంలోనే 45 మిలియన్ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో అతి పెద్ద వ్యవస్థగా జౌళి, దుస్తుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పొందే వారి సంఖ్య 55 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని కూడా ఇన్వ్‌స్ట్ ఇండియా అంచనా వేస్తోంది. 2018-19లో ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 3.1 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి.