బిజినెస్

భారత్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా బంగ్లాదేశీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: భారత్‌లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. మన దేశంలో గత నాలుగేళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేసిన ఒన్నో రల్ స్థానంలో జునైద్ అహ్మద్‌ను నియమించారు. బంగ్లాదేశ్‌కు చెందిన జునైద్ అహ్మద్ ప్రస్తుత పదోన్నతి పొందడానికి ముందు జిమ్ యంగ్ కిమ్ సారథ్యంలోని ప్రపంచ బ్యాంకు గ్రూపునకు చీఫ్ ఆఫ్ స్ట్ఫాగా సేవలు అందించారు. ఆర్థికవేత్తగా శిక్షణ పొంది ఉన్నత స్థాయికి ఎదిగిన జునైద్ అహ్మద్ అభివృద్ధి కార్యకలాపాల్లో అపార అనుభవాన్ని సంపాదించారు. యువ ప్రొఫెషనల్‌గా 1991లో ప్రపంచ బ్యాంకులో చేరిన జునైద్ అహ్మద్ ఆఫ్రికాతో పాటు తూర్పు యూరప్‌లో వౌలిక వసతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకనటలో వివరించింది. నీటి వనరులు, సామాజిక అభివృద్ధి, పట్టణీకరణ తదితర కీలక రంగాల్లో జునైద్ అహ్మద్‌కు అపారమైన అనుభవం ఉందని, ఆర్థికాభివృద్ధికి సంబంధించి భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ బ్యాంకు తన భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడంలో జునైద్ అహ్మద్ అనుభవం ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కిమ్ పేర్కొన్నారు.

చిత్రం.. జునైద్ అహ్మద్