బిజినెస్

చైనాపై డంపింగ్ నిరోధక సుంకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: వివిధ రకాల బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు చికిత్స చేసేందుకు చైనా నుంచి దిగుమతి అవుతున్న మందులపై కేంద్ర ప్రభుత్వం డంపింగ్ నిరోధక సుంకాన్ని విధించే అవకాశం ఉంది. ఈ చౌకబారు మందుల దిగుమతి నుంచి దేశీయ మందుల కంపెనీలకు రక్షణ కల్పించేందుకే ఈ సుంకాన్ని విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరతి డ్రగ్స్ లిమిటెడ్ అనే సంస్థ చైనా నుంచి దిగుమతి అవుతున్న సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రో క్లోరైడ్ నాణ్యతపై ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు జరిపిన డీజీటీఆర్ ఈ సుంకాల విధింపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చైనా-్భరత మధ్య దాదాపు 50 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్యలోటు ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఈ రకమైన చౌకబారు మందుల డింపింగ్ నిరోధించకపోతే ఈ వాణిజ్యలోటు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంటంది. ఆరతి డ్రగ్స్ లిమిటెడ్ సంస్థ చేసిన ఫిర్యాదుపై తాము విచారణ జరిపామని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక ఆధారాలను కూడా పరిశీలిం చామని డీజీటీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ చేసిన నివేదిక బట్టి చైనాపై డంపింగ్ నిరోధక సుంకాన్ని విధించే అవకాశం ఉంటుంది.