బిజినెస్

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు అద్దంపడుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గత నాలుగు రోజులుగా లాభాల్లో సాగిన విషయం తెలిసిందే. ఫలితంగా సెనె్సక్స్ 111 పాయింట్లు పడిపోగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేజి సూచీ నిఫ్టీ తిరిగి 8,800 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఈ వారంలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్, జపాన్ కేంద్ర బ్యాంక్ కీలక సమావేశాల దృష్ట్యా మదుపరులు అచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చనేది అందరి అభిప్రాయం అయినప్పటికీ తదుపరి వడ్డీ రేటు పెంపునకు సంబంధించి ఒక అంచనాకు రావడానికి అది చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయో వేచి చూస్తున్నారని వారంటున్నారు. కాగా, సంస్కరణల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ మూడీస్ అంటూ, సంస్కరణలు గనుక ఆశించిన రీతిలో అమలయితే ఒకటి, రెండేళ్లలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఫలితంగా 28,699-28,489 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ చివరికి 111.30 పాయింట్లు నష్టపోయి 28,523. 20 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 32.50 పాయింట్లు నష్టపోయి 8,759.30 పాయింట్ల వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఆచితూచి వ్యవహరించే ధోరణికి తోడు ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టపోగా, ఒఎన్‌జిసి, టాటా స్టీల్, సిప్లా, మారుతి సుజుకి, లుపిన్, పవర్‌గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాలతో ముగిశాయి. హీరో మోటో కార్ప్ షేరు అత్యధికంగా 2.43 శాతం నష్టపోయింది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఎన్‌టిపిసి, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్, గెయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఎస్‌బిఐ షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి.
ఇదిలా ఉండగా, లిస్టింగ్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందున బిఎస్‌ఇ వచ్చే వారంనుంచి 14 కంపెనీలను పరిమిత(రిస్ట్రిక్టెడ్) ట్రేడింగ్ గ్రూపులోకి మార్చనుంది. వరసగా రెండు త్రైమాసికాలు సెబి నిర్ణయించిన కొన్ని నిబంధనలను పాటించనందున సెప్టెంబర్ 27నుంచి ఈ కంపెనీల వాటాలను జడ్ గ్రూపులోకి మార్చడం జరుగుతుందని బిఎస్‌ఇ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఈ 14 కంపెనీల్లో వలేచా ఇంజనీరింగ్, ఏవన్ లైఫ్ సైనె్సస్, అరోమా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎవరెస్ట్ టూల్స్,, జెవిఎల్ ఆగ్రో ఇండస్ట్రీస్ కరూర్ కెసిపి ప్యాకేజింగ్స్, మైసూర్ పేపర్ మిల్స్, రంజీవ్ అల్లారుూస్, సోమా పేపర్స్, అండ్ ఇండస్ట్రీస్‌వంటి కంపెనీలున్నాయి.