బిజినెస్

ఎట్టకేలకు లాభాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల నష్టాల పరపరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఇంధన స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల వత్తిడి నెలకొన్నప్పటికీ ఇక్కడ ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 271.02 పాయింట్లు (0.66 శాతం), బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 73.45 పాయింట్లు (0.61 శాతం) లాభపడ్డాయి. సెనె్సక్స్ 41,386.40 పాయింట్ల ఎగువన, నిఫ్టీ 12,180.35 పాయింట్ల ఎగువన స్థిరపడ్డాయి. ప్రత్యేకించి నిఫ్టీ వరుసగా నాలుగు రోజుల పాటు చవిచూసిన నష్టాలను అధిగమించింది. సెనె్సక్స్ ప్యాక్‌లో లార్సన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ) అత్యధికంగా 2.98 శాతం లాభపడింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఈ కంపెనీ లాభాల్లో 15 శాతం వృద్ధితో మొత్తం రూ. 2,560.32 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈక్రమంలో కంపెనీ వాటాలు గణనీయంగా లాభపడ్డాయి. కాగా రూ. 35,586 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్న భారతీ ఎయిర్‌టెల్ సైతం గురువారం 1.8 శాతం లాభపడింది. సుప్రీం కోర్టులో వచ్చే వారంలో ఆధునీకృత విధానానానికి సంబంధించిన పిటిషన్‌పై వెలువడే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించడం ద్వారా కంపెనీ మదుపర్ల విశ్వాసాన్ని చూరగొందని వాణిజ్య విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే టెలికాం సంస్థలు ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు సుప్రీం కోర్టు విధించిన గడువు గురువారంతో ముగిసినప్పటికీ అలా చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టవద్దని కేంద్ర టెలికాం శాఖ సంబంధిత అనుబంధ శాఖలకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇలావుండగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇటీవలి నష్టాల నుంచి కోలుకున్నాయి. ప్రధానంగా ఎస్‌బీఐ 2.26 శాతం లాభపడింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ 1.41 శాతం, కోటక్ బ్యాంక్ 1.14 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.96 శాతం లాభపడగా, అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ముడిచమురు ధరలతో ఓఎన్‌జీసీ సైతం 1.12 శాతం లాభాలను సంతరించుకుంది. ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ సైతం లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, టీసీఎస్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి నష్టాల పాలయ్యాయి. అన్ని రంగాల సూచీలూ లాభాల్లో ముగియడం విశేషం. బీఎస్‌ఈలో కేపిటల్ గూడ్స్, స్థిరాస్తి, చమురు, సహజవాయువులు, టెలికాం, వినిమియ వస్తువులు, పారిశ్రామిక రంగాలు 2.33 శాతం వృద్ధిని నమోదు చేశాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.06 శాతం ఆధిక్యతను నమోదు చేశాయి.
కొనసాగుతున్న రూపాయి క్షీణత
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో క్షీణత కొనసాగుతోంది. తాజాగా 9 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో 71.28గా ట్రేడైంది. కాగా చైనాలో సరికొత్త భయానక వైరస్ వెలుగుచూడడంతో ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది. షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు 2.75 శాతం నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలనే నమోదు చేశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.22 శాతం తగ్గి బ్యారెల్ 62.44 డాలర్ల వంతున ట్రేడైంది.