బిజినెస్

కుప్పకూలిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు శనివారం కుప్పకూలాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మదుపరులను ఆకట్టుకోలేకపోయింది. బడ్జెట్ తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో సూచీల పతనం కొనసాగింది. లావాదేవీలు ప్రారంభమైన మరుక్షణం నుంచే ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ ఏకంగా 987.96 పాయింట్లు లేదా 2.43 శాతం నష్టపోయి, 39,735.53 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 300.25 పాయింట్ల లేదా 2.51 శాతం పతనమై, 11,661.85 పాయింట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న మాంద్యం పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను ప్రకటిస్తుందని, ఉద్దీపన చర్యలకు పూనుకుంటుందని ఆశించిన పెట్టుబడిదారులు అందుకు భిన్నంగా బడ్జెట్ దర్శనం ఇవ్వడంతో అందోళన చెందారు. పెట్టుబడుల ఉపసంహరణకు పరుగులు తీయడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 1,275 పాయింట్లు నష్టపోయింది. అయితే, దేశవాళీ మదుపరులు కొంత వరకూ ఆదుకోవడంతో ఊరట చెందింది. ఐటీసీ కంపెనీ షేర్లు అత్యధికంగా, 6.97 శాతం నష్టపోయాయి. భారీ నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల జాబితాలో ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా ఉన్నాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా అధిగమించిన హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్ లాభాలను ఆర్జించాయి.
పెట్టుబడిదారుల నిరుత్సాహం
బడ్జెట్ ఆశించిన రీతిలో లేకపోవడం, కార్పొరేట్ రంగంలో పెట్టుబడులకు భారీ ప్రోత్సాహకాలు ఏవీ కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగిన తీరుతెన్నులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) నుంచి కంపెనీలను మినహాయించాలని ఆర్థిఖ మంత్రి నిర్మల ప్రతిపాదించారు. అంటే, ఆ భారం ఆయా కంపెనీల నుంచి డివిడెంట్లు పొందే వాటాదారులపై పడుతుంది. కంపెనీలకు డీడీటీని రద్దు చేసిన ఆమె, ఆ మొత్తాలను వాటాదారులపైకి రుద్దడంతో మదుపరుల అంచనాలు తారుమారయ్యాయి. స్థూల జాతీయోత్పత్తిలో తగ్గుదల, తత్ఫలితంగా తలెత్తే ద్రవ్య లోటు 3.8 శాతం ఉందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లోటు 3.3 శాతంగా ఉంటుందని తొలుత అంచనా వేశారు. కానీ, వాస్తవ లోటు మరింత ఎక్కువ కావడం కూడా మదుపరులను పునరాలోచనలో పడేసింది. కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అవకాశం ఇవ్వన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అదే విధంగా వివిధ కార్పొరేట్ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 9 శాతం నుంచి 15 శాతం వరకు పెంచాలని ఆమె ప్రతిపాదించారు. అయితే, ఈ నిర్ణయం కూడా విదేశీ మదుపరులను ఆకట్టుకోలేకపోయింది. దీర్ఘకాల పెట్టుబడి లాభాలు (ఎల్‌టీసీజీ)పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. దీర్ఘకాలం అనే పదానికి ప్రస్తుతం ఒక సంవత్సర కాలం అని అన్వయిస్తున్నారు. దీనిని రెండేళ్లకు పెంచితే బాగుంటుందని విదేశీ ఇనె్వస్టర్లు అనుకుంటున్నారు. ఈ రకమైన లాభాలపై ప్రస్తుతం ప్రభుత్వం 10 శాతం పన్ను వసూలు చేస్తున్నది. దీనిని తగ్గించే ప్రతిపాదన ఏదీ లేకపోవడం కూడా విదేశీ ఇనె్వస్టర్లను నిరాశకు గురి చేసింది.
కార్పొరేట్ పన్నులను ఇది వరకు తగ్గించిన కేంద్రం దాని కొనసాగింపుగానే ఎల్‌టీసీజీ టాక్స్‌ను రద్దు చేసింది. ఈ పరిణామంపై కార్పొరేట్ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం తమపై భారం మోపడం సరికాదని ఆక్షేపిస్తున్నారు. మొత్తం మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పెట్టుబడిదారులకు నిరాశే మిగిల్చింది.