బిజినెస్

ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ తగ్గించుకుంది. ఈమేరకు తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో సవరించిన ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ. 11.80 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిబంధకాలు, వాస్తవాలను సమూలంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ స్పష్టం చేశారు. గత మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 13.35 లక్షల కోట్లుగా ఉందని పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. లక్ష్యం మొత్తా న్ని తగ్గించుకున్నప్పటికీ తాజా లక్ష్యాన్ని సాధిస్తామ న్న ఆత్మవిశ్వాసం ఉందన్నారు. ఇదే సుసాధ్యమైన వాస్తవ లక్ష్యమని మనకు ఆదాయ వనరుల విషయం లో కొన్ని లోటుపాట్లున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మోదీ తెలిపారు. ‘ప్రధానంగా రెండు ఆదాయ మార్గాల్లో మనకు రాబడి తగ్గుతోంది. అందులో ఒకటి భారీగా ఫండ్ల తిరిగి చెల్లింపులు, మరొకటి కార్పొరేట్ పన్నుల్లో కోత’ అని వివరించారు. ఆదాయ పన్ను శాఖ ఖాతాలో రూ. 7.40 లక్షల కోట్లు ఇప్పటి వరకు జమయ్యాయన్నారు. గడచిన మార్చితో ముగిసిన త్రైమాసికంలో మాత్రమే అత్యధిక పన్ను వసూళ్ల ఆదాయం సమకూరిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తాజాగా సవరించిన లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఏర్పడిందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొత్త శ్లాబ్ విధానంలో సుమారు 70 ఆదాయ పన్ను తగ్గింపులను రద్దు చేయడం జరిగిందని, అత్యవసరమైన వాటికి మాత్రం మినహాయింపులను కొనసాగించడం జరిగిందని తెలిపారు.