బిజినెస్

వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోఎల్‌ఐసీ ఐపీఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బీమా రంగ దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)ని స్టాక్ ఎక్చేంజీల జాబితాలోకి చేర్చే కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో జరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. ఎల్‌ఐసీలోని కొంత వాటాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా విక్రయించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎల్‌ఐసీని మార్కెట్లలో లిస్టింగ్ చేసేందుకు తొలుత అనేక లాంచనాలు అమలు జరగాల్సివుందని, అలాగే చట్టపరమైన సవరణలు సైతం జరగాల్సి ఉందని కుమార్ స్పష్టం చేశారు. నిబంధనలన్నీ తాము అనుసరిస్తామని, అలాగే చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు ఇప్పటికే చేపట్టామని వివరించారు. బహుశా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎల్‌ఐసీ లిస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈప్రక్రియ పూర్తయితే ఎల్‌ఐసీలో పెద్ద పారదర్శకత నెలకొంటుందని, ప్రజల భాగస్వామ్యంతో ఈక్విటీ మార్కెట్లలో మరింత లోతుగా పాలుపంచుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ వాటాల తగ్గింపుపరిమాణం ఎంత ఉంటుందన్న ప్రశ్నకు సమాదానమిస్తూ దాదాపు 10 శాతం ఉండవచ్చని, ఐతే ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని వివరించారు. ఎల్‌ఐసీ లిస్టింగ్ ద్వారా రూ. 90 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. అలాగే 2.10 లక్షల కోట్ల విలువైన వాటాలను డిసినె్వస్ట్‌మెంట్ లక్ష్యాల్లో భాగంగా వెనక్కు తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలు క్రమంలో ఐడీబీఐ బ్యాంక్‌లో ఉన్న వాటాలను తగ్గించుకునే ప్రక్రియ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జరుగుతుందని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటాలున్నాయి. అలాగే ఐడీబీఐలో సైతం 46.5 శాతం వాటాలున్నాయని ఆయన వివరించారు. ఎల్‌ఐసీని స్టాక్ ఎక్చేంజీల్లో లిస్టింగ్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు వీలుకలగడంతోబాటు కంపెనీ విలువ పరిమితి కూడా తొలగిపోతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రీటెయిల్ మదుపర్లు పాలుపంచుకునేందుకు, సంపదను పెంచుకునేందుకు కూడా వీలుంటుందన్నారు. ఎల్‌ఐసీలోని తన వాటాల్లో కొంత భాగాన్ని ఐపీఓ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
*చిత్రం... కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్