బిజినెస్

ప్రవాస భారతీయుల అంతర్జాతీయ ఆదాయాలపై ఎలాంటి పన్నులూ ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు వచ్చే అంతర్జాతీయ ఆదాయాలపై పన్ను విధించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని, కేవలం భారత్ నుంచి వచ్చే ఆదాయంపైనే పన్ను విధించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. శనివారం నాటి బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రవాస భారతీయుల అంతర్జాతీయ ఆదాయ పన్ను విషయంలో నెలకొన్న అమోమయాన్ని తొలగించడానికే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆమె తెలిపారు. ‘ఇతర దేశాల పరిధిలో వచ్చే ఆదాయానికి పన్ను విధించడానికి నేనెవర్ని?’ అని ఆమె ప్రశ్నించారు. ‘్భరత్‌లో ఆస్తులు కలిగివుండి విదేశాల్లో నివసిస్తూ ఇక్కడి ఆస్తులకు అద్దెలు వంటి వాటిద్వారా ఆదాయాన్ని పొందుతూ ఈదేశంలోనూ, వారు నివసిస్తున్న దేశంలోనూ పన్ను లేకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది?. అలాంటి వారిపై పన్ను విధించే సార్వభౌమాధికారం నాకుంది’. అని నిర్మల ఆదివారం నాడిక్కడ విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ స్పష్టం చేశారు. భారత్‌లో నివసిస్తున్న వారు మాత్రమే భారత పౌరులవుతారని 2020 ఫైనాన్స్ బిల్లు ప్రతిపాదించిందని, ఆ మేరకు ఇతర దేశాల్లో ఉన్నవారు ఇక్కడి ఆస్తులపై వచ్చే ఆదాయంపై పన్ను ఎగవేయడం చట్టవిరుద్ధమే అవుతుందని స్పష్టం చేశారామె. అంతేతప్ప ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్న వారిపై ఇక్కడ పన్ను విధించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రచార సాధనాల్లో వచ్చిన అనుమానాలు పూర్తిగా వాస్తవ విరుద్ధమన్నారు. అలాగే భారత్‌లో నివాసం ఉంటూ దేశం వెలుపల (విదేశాల్లో) నుంచి ఆర్జిస్తున్న ఇక్కడి పౌరుల ఆదాయంపై ఎలాంటి కొత్త పన్నులూ విధించడం లేదని నిర్మల స్పష్టం చేశారు. ఈ విషయంలో వ్యాపారులు, వృత్తి నిపుణులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.