బిజినెస్

స్వల్పంగా కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: ఐసీసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ వంటి సంస్థలు బలంగా పుంజుకున్న నేపథ్యంలో బీఎస్‌ఈ సెనె్సక్స్ సోమవారం జరిగిన లావాదేవీల్లో 137 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్ల వాతావరణం సెనె్సక్స్ కొంతమేర కోలుకోవడానికి దారితీసింది.
నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 136.78 పాయింట్లు పుంజుకుని 39,872.31 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 46.05 పాయింట్లు పెరిగి 11,707.90 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో ఏషియన్ పెయింట్స్ షేర్లు అత్యధిక స్థాయిలో 6.32 శాతం పెరిగాయి. హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్స్, పవర్ గ్రిడ్ షేర్లు కూడా వివిధ స్థాయిల్లో పుంజుకున్నాయి. అలాగే ఐటీసీ షేర్లు 5.09 శాతం మేరకు నష్టపోయాయి. అదేవరుసగా టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా షేర్లు కూడా నష్టాన్ని చవిచూశాయి. మార్కెట్‌పై కొత్త బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుందన్న ఇనె్వస్టర్ల మీమాంశలోనే లావాదేవీలు సాగడం గమనార్హం. అమెరికా, చైనా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా నేటి లావాదేవీలపై ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా దేశ తయారీ రకంలో దాదాపు ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత వృద్ధి నమోదు కావడం కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని కనబరచిందని నిపుణులు చెబుతున్నారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనలను అనేక కోణాల్లో బేరీజు వేసుకుంటున్న ఇనె్వస్టర్లు ఆయా కంపెనీల త్రైమాసిక ఆదాయాలపై దృష్టి సారిస్తున్నారు.
అలాగే, మరో రెండు మూడు రోజుల్లో వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంకు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ కూడా నేటి లావాదేవీలపై ప్రభావాన్ని కనబరిచిందని నిపుణులు వెల్లడించారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే షాంఘై, జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్ కొంతమేర లాభాలతో ముగిసింది.