బిజినెస్

కొత్త పన్నుతో మరింత నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కొత్త బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పొందుపరచిన కొత్త ఆదాయ పన్ను రేట్ల వల్ల పన్ను రాయితీలు పొందేందుకు నిర్బంధంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. దీనివల్ల ఆదాయ పన్ను చెల్లింపుదారుల చేతుల్లో మరింతగా నగదు మిగిలే అవకాశం ఉంటుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తెలిపారు. ఈ బడ్జెట్‌లో రెండు అవకాశాలను ప్రజలకు కల్పించామని, వీటిలో ఒకటి ప్రస్తుతం ఉన్న మినహాయింపులు, తగ్గింపులు ఒదులుకుని తక్కువ పన్ను చెల్లించే విధానమని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న విధానాన్ని కూడా కొనసాగిస్తున్నామని, వీటిలో ఏదో ఒకదానిని పన్ను చెల్లింపుదారులు ఎంపిక చేసుకోవచ్చునని అన్నారు. ‘వీటిలో ఏది ప్రయోజనకరం. ఏది కాదు అన్న విషయాన్ని మేము చెప్పడం లేదు. పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం ఇచ్చాం. అంతే. అలాగని ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు’ అని పాండే అన్నారు. ఈ కొత్త విధానం వల్ల ప్రయోజనం కలుగుతుందే తప్ప ఎవరికీ నష్టం వాటిల్లదని తెలిపారు. కొత్త విధానం ప్రకారం రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం ఉన్నవారికి ఐదు శాతం వార్షిక పన్ను విధిస్తారని, ఆ తర్వాత ప్రతి రెండున్నర లక్షలు పెరుగుదల పైన 10 శాతం, 15 శాతం, 20 శాతం, 25 శాతం పన్ను ఉంటుందని అన్నారు. ఇక వార్షికాదాయం 15 లక్షలు ఉంటే 30 శాతం పన్ను విధిస్తారని తెలిపారు. పాత పద్ధతిలో తగ్గింపులు, మినహాయింపుల ద్వారా పన్ను రాయితీలు పొందాలా? లేదా కొత్త పద్ధతిలో తక్కువ పన్ను చెల్లించాలా? అన్నది ఆయా వ్యక్తులు తమ ఆదాయం బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీని దృష్ట్యా ఈ విషయంలో ఎలాంటి గందరగోళం పడడానికి, ఆందోళన చెందడానికి అవకాశమే లేదని ఆయన చెప్పారు. జూలైలో కొత్త ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
*చిత్రం... రెవెన్యూ కార్యదర్శి పాండే వెల్లడి