బిజినెస్

6న ఆర్‌బీఐ చివరి ద్రవ్య విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: తగ్గుతున్న స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి ద్రవ్య విధానాన్ని రిజర్వు బ్యాంకు గురువారం ప్రకటించనుంది. విధాన సమీక్ష కోసం 4-6 తేదీల మధ్య ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశమవుతుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతానికి మించకపోవచ్చన్న అంచనాలు వెల్లడయ్యాయి. అలాగే, ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల గరిష్టానికి అంటే 7.3 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా ఉల్లి, టమాటా సహా అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడమే ద్రవ్యోల్బణ తీవ్రతకు కారణమైంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు 6 నుంచి 6.5 శాతం మేర ఉండవచ్చునంటూ ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గురువారం ప్రకటించబోయే ద్రవ్య విధానానికి అనేక కోణాల్లో ప్రాధాన్యత చేకూరింది.