బిజినెస్

దేశంలో మాంద్య పరిస్థితులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మాం ద్యం లేదని, జీ-20 దేశాల ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే 2014-19 మధ్యకాలంలో భారత్ అత్యధిక సగటు వృద్ధిని సాధించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని, 2020-21లో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు 5.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే 2021-22లో చైనాను అధిగమించి 6.5 శాతం వృద్ధిరేటును భారత్ సాధించగలుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఎలాంటి మాంద్య పరిస్థితులు లేవని జాతీయ గణాంక కార్యాలయ వివరాలను ఉటంకిస్తూ మంత్రి తెలిపారు. 2014-19 మధ్యకాలంలో జీ-20 దేశాల సగటు వృద్ధిరేటును తీసుకుంటే భారత జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం ఉందని, ఇది అత్యధిక నమోదు అని మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, తద్వారా ఆర్థిక వృద్ధికి మరింత ఊతం అందించబోతోందని ఆయన స్పష్టం చేశారు.

*చిత్రం...ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్