బిజినెస్

కొత్త ఉద్యోగ నియామకాల వైపు యాజమాన్యాల మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఏడాది గడచిన ప్రథమార్థంలో మనదేశంలో జరిగిన నియామకాలు, ఉ ద్యోగులకు కల్పిస్తున్న జీతభత్యాలు, సదుపాయాలపై 55 శాతం యాజమాన్యాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో 55 శాతం ఉద్యోగ నియామకాల్లో కొత్త నియామకాలతోబాటు మరొకరి స్థానంలో నియమించుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ’నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్ 2020’ పేరిట గత జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన అధ్యయన నివేదిక మంగళవారం నాడిక్కడ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 2,400 నియామకాల్లో పాలుపంచుకున్న యాజమాన్యాలపై జరిగిన ఈ అధ్యయనంలో అధిక శాతం ఉద్యోగులకు కల్పిస్తున్న జీతభత్యాలు, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తమైంది. దాదాపు 26 శాతం మంది కొత్త ఉద్యోగ నియామకాల వైపే మొగ్గుచూపగా, 13 శాతం మంది మరొకరి స్థానంలో నియమించుకునేందుకే ఇష్టపడ్డారని నివేదిక వివరించింది. దాదాపు 3 శాతం మంది మాత్రం ముందుగా నిర్థారించిన వేతన ప్యాకేజీలపై ఆసక్తిని చూపలేదు. ఒక శాతం మంది మాత్రం కంపెనీలు మూసివేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 14 శాతం నియామకాలు ప్రఖ్యాత ఐటీ, సేల్స్, మార్కెటింగ్, ఆపరేటింగ్ విభాగాల్లో జరిగాయని నౌక్రీ డాట్ కాం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ ఈ సందర్భంగా తెలిపారు.