బిజినెస్

2020లో జీడీపీ వృద్ధిరేటు 4.9 శాతమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర బడ్జెట్‌లోప్రతిష్టకుపోయి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను అధికంగా చూపారని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ నివేదిక మంగళవారం నాడిక్కడ పేర్కొంది. వాస్తవానికి అలాంటి ఆర్థికాభివృద్థి అంచనాల వల్ల 2020-12 లో ఆర్థిక రంగం నిర్మాణాత్మక, వలయ ప్రయోజనాత్మక అంశాల్లో సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించింది. 2020-21లో సాధారణ జీపీపీ వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందని కేంద్ర బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అలాగే 2022లో 12.6 శాతానికి, 2023లో 12.8 శాతానికి ఈ వృద్ధిరేటు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. ఇతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ సాధారణ వృద్ధిరేటు 8.7 శాతానికి మించే అవకాశాలు లేవని మూడీస్ తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగానే ఉండవచ్చని తెలిపింది. అలాగే వాస్తవ జీడీపీ వృద్ధిరేటు వచ్చే మార్చి 31 వరకు 4.9 శాతంగానే ఉంటుందని, ఇది ప్రభుత్వ అంచనా 5 శాతానికన్నా తక్కువని నివేదించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 5.5 శా తమేనని, ఇదికూడా ప్రభుత్వ ఆర్థిక సర్వేలో పేర్కొ న్న 6 నుంచి 6.5 శాతంకన్నా తక్కువ. ప్రధానంగా ఆదాయ వలయ పరిభ్రమణంలో సుదీర్ఘ ఆలస్యంతోబాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌ఐలు) తీవ్ర వత్తిడికి గురవడం వంటివి చోటుచేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి రుణ భారాలు పెరిగేందుకు దోహదం చేశాయని మూడీస్ వెల్లడించింది. అలాగే వినిమయం, పెట్టుబడులపైనా ఆ ప్రభావం పడిందని తెలిపింది. అలాంటి మాంద్యమే ఆర్థిక రంగంపై సైతం నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్స్ ద్రవ్య లభ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని విశే్లషించింది.