బిజినెస్

34.90 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన నవంబ ర్ వరకు 34.90 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. గడచిన 2017-18లో 60.22 బిలియన్ డాలర్లు, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 62 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా విదేశీ పెట్టుబడుల్లో తగ్గుదల నెలకొన్నప్పటికీ మన దేశంలో మాత్రం ఏ ఏటికాఏడు ఈ పెట్టుబడుల శాతం పెరుగుతూ నే ఉందన్నారు. 2018-19లో ఈ పెట్టుబడుల్లో 2.37 శాతం ఆధిక్యత చోటుచేసుకుందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న వివిధ ప్రోత్సాహక చర్యలు అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విశేషంగా ఆకర్షించాయన్నారు. ప్రత్యేకించి సరళతర వాణిజ్యం, ఎఫ్‌డీఐ విధానాల్లో సహేతుక సంస్కరణలు, దివాళా.. బ్యాంకుల మోసాల ని యంత్రణ శిక్షా స్మృతి 2016 వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు దోహదం చేస్తున్నాయని ఠాకూర్ తెలిపారు. 2019 ప్రపంచ పెట్టుబడుల నివేదిక (డబ్ల్యుఐఆర్) ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అమితంగా ఆకర్షిస్తున్న దేశాల జాబితాలో భారత్ 25 నుంచి 2018లో ఏకంగా 9వ స్థానానికి ఎగబాకిందని, ఆ ఏడాది మొత్తం 3.23 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశానికి వచ్చాయని సభకు వివరించారు.

*చిత్రం... కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్