బిజినెస్

మార్కెట్లకు జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: స్టాక్ మార్కెట్లు ఈవారం దూకుడును కొనసాగించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకటో తేదీన లోక్‌సభలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత మార్కెట్ వర్గాల్లో కొత్త జోష్ కనిపించింది. మదుపరులు వాటాల కొనుగోళ్లకు ఆసక్తిని ప్రదర్శించడంతో బుల్ రన్ కొనసాగింది. వారం మొత్తం మీద, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 1,406.32 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 436.50 పాయింట్లు లాభపడ్డాయి. ఇటీవల కాలంలో ఇంత భారీగా మార్కెట్లు లాభాలను ఆర్జించిన సందర్భాలు లేవు. గత శనివారం నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సోమవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమంగా లాభాల బాట పట్టింది. ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, ట్రేడింగ్ మొదలైన మరుక్షణం నుంచి చివరి వరకూ సెనె్సక్స్, నిఫ్టీ పాయింట్ల సూచీ మెరుగుపడుతునే వచ్చింది. అంతకు ముందు నెలకొన్న అనిశ్చితికి తెరపడగా, స్థిరంగా కొనసాగిన లావాదేవీల కారణంగా సెనె్సక్స్ 136.78 పాయింట్లు మెరుగుపడి, 39,872.31 పాయింట్లకు చేరింది. అయితే, మంగళవారం సెనె్సక్స్ ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఏకంగా 917.07 పాయింట్లు మెరుగుపడి, 40,789.38 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 271.75 పాయింట్లు లాభపడడంతో 11,979.65 పాయింట్లుగా నమోదైంది. తర్వాతి రెండు రోజులు కూడా మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. బుధవారం సెనె్సక్స్ 353.28 పాయిం ట్లు మెరుగుపడి 41,142.66 పాయింట్లకు, నిఫ్టీ 109.50 పా యింట్లు లాభపడి 12,089.15 పాయింట్లకు చేరాయి.
ఆర్బీఐ రెపో రేట్ల సవరణ, ఇతర కీలక నిర్ణయాలను ప్రకటిస్తుందని ఊహించిన మదుపరులు అందుకు భిన్నమైన ప్రకటన వెలువడడంతో నిరాశ చెందారు.
ఈ నిర్ణయాల నేపథ్యంలో, గురువారం స్టాక్ మార్కెట్ల దూకుడు తగ్గింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 163.37 పాయింట్లు లాభాలతో 41,306.03 పాయింట్లకు చేరింది. 48.80 పాయింట్లు మెరుగుపడిన నిఫ్టీ 12,137.95 పాయింట్లుగా నమోదైంది. కాగా, అప్పటి వరకూ లాభాలు ఆర్జించిన స్టాక్ మార్కెట్లు లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ నిర్ణయాలతోపాటు, పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపడంతో, సెనె్సక్స్ 154.18 పాయింట్లు పతనమై, 41,141.85 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 39.60 పాయిం ట్లు నష్టపోయి, 12,098.35 పాయింట్లకు చేరింది. స్థూలంగా చూస్తే మాత్రం ఈవారం స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ బలంగా నిలబడ్డాయి. చివరి రోజును మినహాయిస్తే, మిగతా నాలుగు రోజులూ లాభాలను ఆర్జించాయి. వచ్చే వారం కూడా ఇదే ఒరవడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.