బిజినెస్

40% పెరిగిన ఎన్‌ఐఐటీ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కార్పొరేట్ సెక్టార్ నుంచి డిమాండ్ పెరగడంతో 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌ఐఐటీ కన్సాలిడేటెడ్ నికర లాభం 40 శాతం వృద్ధితో రూ. 27.1 కోట్లకు పెరిగింది. ఈ సంస్థ 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 19.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. నైపుణ్యాలు, ప్రతిభను అభివృద్ధి చేయడంలో ఒక గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఎన్‌ఐఐటీ ఈ వివరాలు వెల్లడించింది. తాము రెండేళ్ల క్రితం కెనడా బిజినెస్‌ను ప్రారంభించామని, అది ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమయిందని ఎన్‌ఐఐటీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కే థదాని ఒక వార్తాసంస్థకు తెలిపారు. తమ సంస్థ మొత్తం వ్యాపారంలో విదేశీ మార్కెట్ వాటా 77 శాతముందని, దీనిలో అమెరికా, యూరప్ మార్కెట్ల వాటా ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. ఎన్‌ఐఐటీ 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 247.6 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని సాధించింది. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్జించిన కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 225.5 కోట్లతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ.