బిజినెస్

కరోనా ప్రచారంతో కుదేలైన మాంసం విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 9: క రోనా వైరస్ ప్రభావంతో నగరంలోని మాంసం దుకాణాలు వెలవెలబోయా యి. వేట మాంసం, కోడి మాంసం, చి వరకు కోడిగుడ్లు కూడా తినరాదని ఆ వైరస్ ప్రభావం వల్ల ప్రాణాలకు హాని అని వాట్సాప్, యుట్యూబ్‌లో పోస్టింగ్ ల ప్రభావంతో ఆదివారం పశ్చిమలోని మాంసం దుకాణాల వద్ద వినియోగాదరులు లేక వ్యాపారాలు గిలగిల్లాడారు. ముఖ్యంగా వేటమాంసం, కోడిమాం సం దుకాణాలు ప్రతి ఆదివారం కిటకిటలాడటం జరుగుతుంది. వాటి కోసం బారులుతీరిన సందర్భాలూ ఉన్నాయి. ఈనెల ఆరంభంలో కోడి మాంసం ధ ర కిలో రూ. 180 అమ్మారు. కరోనా ప్ర భావంతో ఈఆదివారానికి కిలో రూ.40 తగ్గి నేడు కిలో రూ.140లకే లభిస్తుం ది. ధరలు తగ్గినా వినియోగదారులు తగ్గారు. ఓ వ్యక్తి పశ్చిమ గోదావరి జి ల్లాలో కోళ్లఫారం వద్ద మృత్యువాత ప డిన వందలాది ఫారం కోళ్ల ఫొటోను వాట్సాప్‌లో పెట్టడంతో అది రాష్ట్రం మొత్తం వైరల్ అయ్యింది. వైరస్ కావ చ్చు అని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. దాం తో మాంసం ప్రియులు బతికుంటే బ లుసాకు తినవచ్చు అనే చందంగా ఈ ఆదివారం ఆ ప్రకటన ఉపవాసంలా మాంసం కొనడమే మానేశారు. దాం తో కోడి మాంసం వ్యాపారులు కొంప మునిగిందని వాపోతున్నారు కోడి మాంసం ధరలు పెరిగి ఇల్కెక్కి కూసినాగాని మాంసం ప్రియులు వెనుతిరగలేదు. కానీ నేడు మాంసం దుకాణాల ముఖమే చూడడం లేదని కేఎల్ రావు నగర్‌లోని ఎస్‌ఎస్ నాయుడు చికెన్ యజమాని శొంఠి నరసింహారావు తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు రూ. 25లక్షల వ్యాపారం కోల్పోయామన్నా రు. కోళ్లను తినవద్దని నగరపాలక సం స్థ ఆరోగ్యశాఖ వైద్యులు అధికారికం గా ప్రకటించలేదు, మాంసం అమ్మవద్ద ని తమకు చెప్పలేదు, అయినా కరోనా వైరస్‌పై ప్రచారం వ్యాపారులను ఇబ్బందులు పెడుతుందని నరసింహారావు అన్నారు. ఇక వేట మాంసం విషయం కూడా అలాగే ఉంది. అసలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జీవాలు లభించమే తక్కువ. వ్యాపారాలు అరకొరగా సాగుతాయి. నేడు వేట మాంసం కిలో రూ.680 నుండి రూ.700 వరకు అమ్ముతున్నారు. రోగులకు ఎక్కువగా ఖైమా వండిపెట్టడం జరుగుతుంది. రోగులు, సామాన్యులు కూడా వేట మాంసం దుకాణాల వైపే చూడటంలేదని చిట్టినగర్‌లోని నగరాల శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం ఎదురుగల రామచంద్రరావు మటన్‌షాపు యజమాని కే శ్యామ్‌రాజ్ అన్నారు. ఆదివారమే కాదు ప్రతి రోజూ ఆ షాపు వినియోగదారులతో కిటకిటలాడేది. ఈ ఆదివారం మాత్రం ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది.